Tuesday, 14 December 2021

వలస కూలి

కూడు  లేదు గూడు  లేదు 

ఏడ పోను  రూక లేదు 

కూలి నాలి ఊసు లేదు 

ఆలి  దాలి  సెయ్య   లేదు 


మాయదారి రోగమొచ్చె

పోయె జాము  ముంచు కొచ్చె 

ఉన్న చోట ఉండ లేక 

కన్న ఊరి  దారి సాగె 


మూతి  ముక్కు గుడ్డ  కట్టె 

రాతి  గుండె బిడ్డ నట్టె 

నెత్తి  మీద గంప పెట్టె 

బత్తి చమురు సేత పట్టె 


చుర చుర సూరీడు కాచె 

కర కర మంటలన్    దాచె

కులం  మతం జాడ లేదు 

హలం  బలం   జార లేదు 


కూలి వాడు,  గాసగాడు   

పాలెగాడు,  సేద గాడు 

వలసకూలి  అయ్యినాడు 

అలుపెరగని గురుతు వీడు 


Saturday, 16 October 2021

Telugu Shatakam

1. తెలుగు తెనుఁగు ఆంధ్ర తెఱుగులేమైనను 

పలుక తేనె లొలికు;  పాట పాడ  

ధవళ మేఘమాల  ధరణిని  చుంబించె  

తెలుగు తేజ! యన్యదేశపౌర 


2.ఉర్దు తమిళ సిక్కు  గుజరాత  యుత్తర

వారు వారి భాష పలికె మురిసె

నేడనున్న నేడు నీకేల  బీరము

తెలుగు తేజ! యన్యదేశపౌర 


3.వేష భాష మారె ఇలికను పాలించె 

ఆస్తిపాస్తి పెరిగె అందనంత 

నందడంట తల్లిదండ్రికి ధర్మమా

తెలుగు తేజ! యన్యదేశపౌర 


4. దేశ భాషలందు తెలుగు లెస్సని కొని 

యాడ  బడెను అవనియందు దేవ 

బాస కినుక జూపె  బాగైన తెనుగుపై 

తెలుగు తేజ! యన్యదేశపౌర 


Saturday, 28 August 2021

అవధానం

 అవధానం:


బ్రహ్మశ్రీ వద్ధిపర్తి  పద్మాకర్  గారికి వినమ్ర ప్రణామాలతో తాల్  స్వాగతం పలుకుతోంది... 


ఉత్కళిక :

ధిప్రజుడు తెలుగు కవు
ధిపతి ప్రణవ పీఠము

ఆంధ్ర మురారి, గురు బ్రహ్మ
ఆంధ్ర సుభాషణాజిహ్మ

వీనుల విందు మీ పలుకు
తేనెలొలుకు తెలుగు వెలుగు

కూసు పలుకు సుమ పదముల్
మా సుమధుర స్వాగతముల్

                                        -రాజేష్ తోలేటి 



ఉర్దు తమిళ సిక్కు  గుజరాతి  ఉత్తర
వారు వారి భాష పలికె మురిసె
ఏడ ఉండు మనకు ఏలరా  బీరము
తెలుగు తేజ శ్వేత దేశ  పౌర

తెలుగు లో అపృస్తుత ప్రసంగ ప్రశ్నలు 


1.ఆలస్యం అమృతం  విషం, నిదానమే ప్రధానం 

2. దెయ్యాలకి , భూతాల కి ఛందస్సు అంటే భయమా? మసజసతతగ - శార్దూలా 

3. పండగ పూట  కూడా పాత మొగుడేనా 

4. ఉత్తరానికి, దక్షిణానికి తేడా?

5. అంటార్కిటికా లో ఎక్కడ అవధానం చేస్తున్నారు?

6. 33 కోట్ల  దేవతల పేర్లు ఏమిటి?

 బృహదాకరణ్యకం అనే ఉపనిషత్తు (శాకల్యబ్రాహ్మణం అనే అధ్యాయం) జనకమహారాజు సభలో జరిగిన వేదాంత చర్చను చెబుతుంది. యాజ్ఞవల్క్యుడు అనే బ్రహ్మజ్ఞానితో మిగతా పండితులందరూ దేవుడంటే ఏమిటి అనే విషయమై చర్చిస్తారు. దేవుళ్లు ఎందరు అని కూడా ఒక ప్రశ్న వస్తుంది. యాజ్ఞవల్క్యుడు వేదంలోని మాటనే ఉటంకించి దేవతలు 3,306 అంటాడు. వాళ్లందరూ ఎవరు అనే ప్రశ్నకు వారందరూ కూడా 33 రకాల దేవతల యొక్క అనేక రూపాలు అని చెబుతాడు

7.  భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళందరి పేర్ల చివరా డు ఉంది, ధర్మరాజు కి లేదు..ఎందుకంటే

--------------------------------------------------------

8.  రఘు రాముడు, కోదండ రాముడు, సీతారాముడు  విన్నాగాని . ఈ అనంత రాముడు ఎక్కడ నుండి వచ్చాడు?

9. బ్రహ్మ రాక్షసి  అనీ పేరు ఎలా వచ్చింది? పుష్కర్, రాజస్థాన్ + 5

10.  చారు, దానికా పేరు ఎలా వచ్చింది? నీళ్లు, చింతపండు, ఉప్పు , పోపు 

11. తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ plates, stellar crystals, columns, needles, spatial dendrites, capped columns, and irregular forms

12. గణపతి బప్పా 'మోర్యా'  అనగా ఏమి? మోర్  అంటే నెమలి కదా . మూషికంగారి మనో భావాలు దెబ్బతింటాయేమి కదా 

13.  కన్ను మూశాడు.  కన్నులు మూశారు కాదా?

14. కంగు తినడమేమిటి?

15.అత్తెసరు అంటే అర్థం ఏమిటి? ఈ పదం ఎలా వచ్చింది?

16.చొప్పదంటు ప్రశ్నలు  అంటే ?

17హైలెస్సా అన్న పదానికి అర్థం ఏమిటి? అది ఎలా వచ్చింది?

18. వారాల పేర్లు పురాణాలలో ఉన్నాయా?  Surya Siddhanta is much older(7300 BCE- 7800 BCE). Aryabhatiya appears to be from fifth century CE.

https://nileshoak.wordpress.com/2016/09/04/origin-of-weekday-names/

19.జీబ్రాకు నల్ల చర్మం మీద తెల్ల చారలా , తెల్ల చర్మం మీద నల్ల చారాలా?

20.వరూధిని, ప్రవరాఖ్యుడు- లేపనం -ఇంద్రియ నిగ్రహం 

21.  'అన్నమో  రామచంద్రా'  జాతీయం ఎలా వచ్చింది ?

22. రాక్షసుడికి గుడి ఎక్కడ ఉంది?

23. ముక్కోపి? కన్నుకోపి ,చెవి కోపి ...?

24. బ్రహ్మ ...చతుర్ముఖ పారాయణం సంబంధం?

25. ఇందు వదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసు లలనవే !

26. యమహో నీ యమా యమా అందం. చెల రేగింది ఎగా దిగా తాపం.

యముడు అందగాడా? ఈ పురాణం లో ఉంది?

27.జగద్గురు విగ్రహ వాక్యం -శ్రీ రామానుజచార్య  jagadguru shankaracharya
28. కంచి గరుడ సేవ అంటే ఏమిటి? బల్లి -గ్రద్ద .... కదా ఏమిటి?

29. సవా అంటే ఏమిటి ? సవా లక్ష?

--------------------------------------------

30.Ratnakaram Satyanarayana Raju gariki |Rani gariki saapatyam emiti?

31.Garilee enduku tinaaali?vinte mahabharathamee vinali

32.Udyog parvam loo evaru evariki vudyogam ichhaaru?

33.నక్కకు నాక లోకానికి ఉన్నంత తేడా?

34. అమూర్త సాధన అభియాంత్రికుడు?(Software Engineer)

35.కిలికించితము:రోషాశ్రుహర్షభీత్యాదుల సంకరరూపమగు స్త్రీ యొక్క శృంగారచేష్టా విశేషము

36.దిడ్డము?

37.కృష్ణ nemali pinhcam lu enni? ee vypu untaayi?

38.ముందుంది ముసళ్ల పండగ లేక

ముందుంది ముసుర్ల పండగ?

39. పొట్టిగా ఉండేవాళ్ళని.. వాడొక "పొట్టి ఠంగణా " అనే వాళ్ళు. టింగణా=పొట్టి జాతి గుఱ్ఱం

40.చంద్రుడిని చందమామ అంటాం కదా...అసలు మామ అని ఎందుకు అంటాం?

41.గీత కార్మికులు

42. గంగ శివుని భార్య --శాంతనుడి  భార్య?

శ్రీనాధుడు చాటువు గంగ వీడు పార్వతి చాలున్ 

సిరిగలవానికి జెల్లును
తరుణులు బదియారు వేలు దగ బెండ్లాడన్
తిరిపమున కిద్దఱాండ్రా
పరమేశా గంగ విడువు పార్వతి చాలున్

43. 

వంగతోటనుండు వరిమళ్ళలోనుండు

జొన్నచేలనుండు చోద్యముగను

తలుపుమూలనుండు తలమీఁదనుండును

దీని భావమేమి తిరుమలేశ?

44. దెయ్యం  VS  కొరివి దెయ్యం 

45. భూతం vs పిశాచం 

46. ఆత్మ  vs  ప్రేతా త్మ 

47.  అద్వైతం నుండి  ద్వైతం వచ్చిందా?

48. అవలక్షణం, అవమానం, అవధానం 

49.దుర్మార్గం , దుర్ముహర్తము, దుశ్శాలువా 






Sunday, 1 August 2021

నిదద్రువు-CeNaRe-01-01-2021





నెత్తి మీద నీలి తెర  చినిగిపోతోంది 
కాలి  కింది ధూళి పొర ఎగిరిపోతుంది 
నీరదాలు తేలలేక కూలిపోతున్నాయి 
సాగరాలు ఎగిరెగిరి మీదికొస్తున్నాయి 

హరిత వనాల ప్లాస్టిక్ పూలు 
ఆమ్లజని మంచు తెరలు 
జన్యుమార్పిడి సంకర విత్తనాలు 
మానవ జాతి  శాపాలు సూక్ష్మ రాకాసులు 


హిమగిరులు విశ్వంభర అశ్రుధారులవుతున్నాయి 
మర్త్యుడు ధూర్తుడువుతున్నాడు, విపుల విలపిస్తోంది!




 ప్రపంచపదులు 
---CiNeRe
కొమ్మపైనే నిలిచి నింగిని కొల్లగొట్టే కోరిక 
ఒడ్డు పైనే నిలిచి కడలిని ఒడిసిపట్టే కోరిక 
ఓరి మనిషీ  నువ్వు మూరెడు; కోరికేమో బారెడు 
మూట విప్పక దాతగా తెగ మోగిపోయే కోరిక 
త్యాగమంటక నేతగా ఊరేగిపోయే కోరిక 
సముద్రానికి చమురు పూస్తే జిడ్డు పడుతుందా 
హిమనగానికి బొగ్గు పూస్తే  నల్లబడుతుందా

మధ్యాక్కర(పంచపాది)
విపుల, విశ్వ, విశ్వంభర, విశ్వగంధ, విశ్వధారిణి, విశ్వము, విశ్వమేఖల, విశ్వసహ


Saturday, 20 February 2021

వేటూరి గీతాలంకారాలు Veturi Gitalaankaraalu

వేటూరి గీతాలంకారాలు 


యమకాలంకారం :


1)ఆది యమకాలంకారం:

మా  రేడు నీవని  ఏరేరి తేనా  మారేడు 

 https://youtu.be/UWHST0gqkWM?t=105


 మైనా క్షణమైనా 

https://youtu.be/JHlxa7SFmok?t=188


చుక్కా నవ్వవే , నావకు చుక్కానవ్వవే  

https://youtu.be/Q57J7ULKjew?t=116


కాళింది మడుగున కాళీయుని పడగలా

బాల గోపాల , మా బాలగోపాలుని  

అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ

https://youtu.be/Q8OKmT0-i-s?t=83

 (ఛేకానుప్రాసాలంకారం )

(మధ్య  యమకాలంకారం)


2)మధ్య  యమకాలంకారం:


 ప్రేమలేఖ రాసా నీకంది ఉంటది 

పూలబాణమేసా ఎదకంది ఉంటదే

 https://www.youtube.com/watch?v=Dw7YlyzuBKw



శంకర గళ నిగళము  

https://youtu.be/JpGSPvWzHmc?t=63


 విరులు తెరలే  తెరచి రావే 

https://youtu.be/YmVNM9vBQLM?t=102


3)అంత్య యమకాలంకారం:


 ఐలవ్యూ ఓ హారికా

నీ ప్రేమకే జోహారికా 

https://www.youtube.com/watch?v=Ga2Ed523HXY

(వృత్యానుప్రాసాలంకారం )


 జంట బాసిన పక్షి  కంట పొంగిన గంగ 

తన కాంటిలో పొంగ  మనసు  పొంగంగ

https://youtu.be/QAoBu-SMS5U?t=38


పరవశాన శిరసూగంగా  ధరకు జారినా శివగంగా  

https://youtu.be/iODkMYX4x1E?t=176