Sunday, 1 August 2021

నిదద్రువు-CeNaRe-01-01-2021





నెత్తి మీద నీలి తెర  చినిగిపోతోంది 
కాలి  కింది ధూళి పొర ఎగిరిపోతుంది 
నీరదాలు తేలలేక కూలిపోతున్నాయి 
సాగరాలు ఎగిరెగిరి మీదికొస్తున్నాయి 

హరిత వనాల ప్లాస్టిక్ పూలు 
ఆమ్లజని మంచు తెరలు 
జన్యుమార్పిడి సంకర విత్తనాలు 
మానవ జాతి  శాపాలు సూక్ష్మ రాకాసులు 


హిమగిరులు విశ్వంభర అశ్రుధారులవుతున్నాయి 
మర్త్యుడు ధూర్తుడువుతున్నాడు, విపుల విలపిస్తోంది!




 ప్రపంచపదులు 
---CiNeRe
కొమ్మపైనే నిలిచి నింగిని కొల్లగొట్టే కోరిక 
ఒడ్డు పైనే నిలిచి కడలిని ఒడిసిపట్టే కోరిక 
ఓరి మనిషీ  నువ్వు మూరెడు; కోరికేమో బారెడు 
మూట విప్పక దాతగా తెగ మోగిపోయే కోరిక 
త్యాగమంటక నేతగా ఊరేగిపోయే కోరిక 
సముద్రానికి చమురు పూస్తే జిడ్డు పడుతుందా 
హిమనగానికి బొగ్గు పూస్తే  నల్లబడుతుందా

మధ్యాక్కర(పంచపాది)
విపుల, విశ్వ, విశ్వంభర, విశ్వగంధ, విశ్వధారిణి, విశ్వము, విశ్వమేఖల, విశ్వసహ


No comments: