కూడు లేదు గూడు లేదు
ఏడ పోను రూక లేదు
కూలి నాలి ఊసు లేదు
ఆలి దాలి సెయ్య లేదు
మాయదారి రోగమొచ్చె
పోయె జాము ముంచు కొచ్చె
ఉన్న చోట ఉండ లేక
కన్న ఊరి దారి సాగె
మూతి ముక్కు గుడ్డ కట్టె
రాతి గుండె బిడ్డ నట్టె
నెత్తి మీద గంప పెట్టె
బత్తి చమురు సేత పట్టె
చుర చుర సూరీడు కాచె
కర కర మంటలన్ దాచె
కులం మతం జాడ లేదు
హలం బలం జార లేదు
కూలి వాడు, గాసగాడు
పాలెగాడు, సేద గాడు
వలసకూలి అయ్యినాడు
అలుపెరగని గురుతు వీడు
No comments:
Post a Comment