Wednesday, 20 November 2024

సిపాయి

వాడని వీడి వీధిని వీడి  

ఇంటిని వదిలి  ఇంతిని వదిలి 

నిప్పుని తొక్కి మంచుని ఎక్కి 

కన్నీటి బొట్టుని  తూటా చేసి 

శత్రు గుండెల్లో నిలువుగా దింపి 

 ఆ రుధిరం భారతమాత  నుదుటి దిద్ది 

కన్న వారి కోసం ఉన్న ఊరి తోవ పట్టి 

చిన్ని పాప బోసి నవ్వు 

చిన్న నాటి దోస్తు పలకరింపు 

వేచి ఉన్న వీర నారి  జ్ఞాపకాలు 

నీరదాలై  నీ గుండెలనిండా వర్షిస్తుంటే 

అప్పుడు..... 

మత రక్కసుల కరాళ నృత్యం కాల రాయటానికి పిలుపొస్తుంది 

మాతృభూమి పరిరక్షణకి బంధాలు  తెంచుకొని 

మరల కత్తి బట్టి దేశద్రోహుల తలలు కొట్టి 


నువ్వు తిరిగి వస్తావు 


జెండా పట్టుకొని వస్తావో, చుట్టబెట్టుకొని వస్తావో 

ఒక్క తుపాకీ చేబూని వేంచేస్తావో, వంద తుపాకులు గర్జిస్తుంటే అంబరం నుండి వందనం చేస్తావో 

 ఆ వీర గాధల విజయ  గురుతులతో వస్తావో  నీవే తీపి గుర్తుగా ఉండి  పోతావో!

 

 

Tuesday, 28 March 2023

Telugu Padya Rachana

గైహికం -2

(2.)

1.తలపు 

2.తలుపు 

3.తరువు 

4.తనువు 

5. తపన 

6. తకిల

7. తరుగు

8. తరము

9. తలము

10. తగటి

11. తగడు

12. తగువు

13. తనివి

14. తనిమ

15. తనయ

(3)

1.గజము 

2. గళము 

3. గలము

4. గణము

5. గవర

6. గవరు

7. గతము

8. గతిల

9. గతుకు

10. గతుడు

11. గతులు

12. గమక

13. గవద

14. గవిల

15. గవుసు

(4)

1. మాలిక

2. మాడుగు 

3. మాలతి

4. మానము 

5. మాదిగ

6. మానిని

7. మానస

8. మాంగన

9. మాత్రము

10. మాయము

11. మాయడు

12. మాటలు

13. మాత్రలు

14. మాయలు

15. మాలలు

(5) 

1. పదాలు 

2. పదార్థ

3. పలాగ్ని

4.పలాన

5. పలాండు

6. పలాద

7. పలాల

8. పలాలి

9. పతాక

10. పతాకి

11. పనాయి

12. పటాక

13. పటాకు

14. పటాసు

15. పకాలి

గైహికం -3

UUU 

  1. ఆధారం 
  2. ఆచారం 
  3. ఆవేశం 
  4. ఆనాడీ
  5. ఆరాటం
  6. పోరాటం
  7. వ్యాపారం 
  8. బ్రాహ్మణం 
  9. కావేరీ
  10. వేదంలో 
  11. సంతోషం 
  12. ఆనందం 
  13. సందేహం 
  14. ఒప్పందం 
  15. ప్రజ్ఞానం
UII 

1. మాలిక

2. మాడుగు 

3. మాలతి

4. మానము 

5. మాదిగ

6. మానిని

7. మానస

8. మాంగన

9. మాత్రము

10. మాయము

11. మాయడు

12. మాటలు

13. మాత్రలు

14. మాయలు

15. మాలలు


UIU 
  1. వ్యాపకం 
  2. జ్ఞాపకం 
  3. మారకం 
  4. కారకం 
  5. కారణం 
  6. కారడం 
  7. కాగడా 
  8. వేగడం 
  9. ఉత్తరం 
  10. దక్షిణం 
  11. వీగడం 
  12. మ్రోగడం 
  13. గౌరవం 
  14. చేరడం
  15. మారదాం 

UUI 
  1. జేజేలు 
  2. బాజాలు 
  3. కాజాలు 
  4. కారాలు
  5. బేరాలు 
  6. మార్గాలు 
  7. పాపాలు 
  8. వేదాలు 
  9. తాపాలు 
  10. కోపాలు
  11. తేడాలు  
  12. ఆవాలు 
  13. నేరేడు 
  14. మారేడు 
  15. ఏరేరి 

గైహికం -4


 II

  1. సుముఖ
  2. ప్రముఖ
  3. ద్విముఖ
  4. శివుడు 
  5. గురుడు 
  6. అవని 
  7. నిఖిల  
  8. అఖిల 
  9. అజిత 
  10. అనిత 
  11. యమున
  12. జమున 
  13. అమల 
  14. కమల 
  15. చరిత 


IUU
 
  1. రమాశ్రీ 
  2. సిరాశ్రీ 
  3. మనామా 
  4. పనామా 
  5. గరాటా 
  6. పరోటా 
  7. పగోడా 
  8. నవీనా 
  9. కరోనా 
  10. కత్రీనా 
  11. జిరాఫీ 
  12. గొరిల్లా 
  13. గులాబీ
  14. సపోటా 
  15. టమోటా 

IUI 
  1. అమేయ 
  2. విశాఖ 
  3. కుమారి 
  4. పలాస 
  5. తనూజ 
  6. తమన్న 
  7. జయమ్మ 
  8. తెనాలి 
  9. మనాలి 
  10. దిలీప 
  11. ధరిత్రి 
  12. నలంద 
  13. అశోక 
  14. నవీన 
  15. నిరోష 



IIU

  1. కనకం 
  2. శునకం 
  3. కటకం 
  4. పుటకమ్
  5. నమకం
  6. చమకం 
  7. రజితం 
  8. కవచం 
  9. కదళం
  10. దసరా 
  11. అగరా 
  12. ముజరా  
  13. ముదరా 
  14. అఱడా  
  15. అచలా 
















Wednesday, 4 May 2022

తటవర్తి గురుకులం

 పాల సాగరంబు ర్వతంతోడనే

చిలక చిలక పుట్టె చిత్ర భాష

దే దేశమందు  దిశ వర్దిల్ల

తెలుగుతనము నిలుపు విలువ మనకు


Thursday, 10 February 2022

Ghantasala Avadhanam

 1. What is the first movie of Ghantasala as an actor?

Sri Seeta Rama Jananam (1944) ANR first movie as Hero

 2. What is the first movie of Ghantasala as a Music Director?

 Mana Desam (1949), which was N. T. Rama Rao's first film

3. What was the nickname for Ghantasala during his childhood?

Balabharatudu

4. Which character Ghantasala has played in the stage play 'Chintamani'?

As Bilwamangala

5. What is the reason for putting Ghantasala into jail?

i) for singing patriotic and revolutionary songs ii) for the removal of rail lines

6. What is the name of Ghantasala's Second Son?

Ratna Kumar

7. Which recording company has rejected the voice of Ghantasala as not suitable for mike?

His Masters Voice Company (HMV), at Madras

8. In which movie does NTR appears as Krishna first time? Produced by Ghanatasala banner 

G V S Productions

9. Paadave Radhika- Pendli Pilupu  

10. Thotalo Naa Raju -  Ghantasala, Susheela --Ekaveera

first movie SP, Ghantasal sang together

11. In which movies Ghanatasala acted?


Tuesday, 14 December 2021

వలస కూలి

కూడు  లేదు గూడు  లేదు 

ఏడ పోను  రూక లేదు 

కూలి నాలి ఊసు లేదు 

ఆలి  దాలి  సెయ్య   లేదు 


మాయదారి రోగమొచ్చె

పోయె జాము  ముంచు కొచ్చె 

ఉన్న చోట ఉండ లేక 

కన్న ఊరి  దారి సాగె 


మూతి  ముక్కు గుడ్డ  కట్టె 

రాతి  గుండె బిడ్డ నట్టె 

నెత్తి  మీద గంప పెట్టె 

బత్తి చమురు సేత పట్టె 


చుర చుర సూరీడు కాచె 

కర కర మంటలన్    దాచె

కులం  మతం జాడ లేదు 

హలం  బలం   జార లేదు 


కూలి వాడు,  గాసగాడు   

పాలెగాడు,  సేద గాడు 

వలసకూలి  అయ్యినాడు 

అలుపెరగని గురుతు వీడు 


Saturday, 16 October 2021

Telugu Shatakam

1. తెలుగు తెనుఁగు ఆంధ్ర తెఱుగులేమైనను 

పలుక తేనె లొలికు;  పాట పాడ  

ధవళ మేఘమాల  ధరణిని  చుంబించె  

తెలుగు తేజ! యన్యదేశపౌర 


2.ఉర్దు తమిళ సిక్కు  గుజరాత  యుత్తర

వారు వారి భాష పలికె మురిసె

నేడనున్న నేడు నీకేల  బీరము

తెలుగు తేజ! యన్యదేశపౌర 


3.వేష భాష మారె ఇలికను పాలించె 

ఆస్తిపాస్తి పెరిగె అందనంత 

నందడంట తల్లిదండ్రికి ధర్మమా

తెలుగు తేజ! యన్యదేశపౌర 


4. దేశ భాషలందు తెలుగు లెస్సని కొని 

యాడ  బడెను అవనియందు దేవ 

బాస కినుక జూపె  బాగైన తెనుగుపై 

తెలుగు తేజ! యన్యదేశపౌర 


Saturday, 28 August 2021

అవధానం

 అవధానం:


బ్రహ్మశ్రీ వద్ధిపర్తి  పద్మాకర్  గారికి వినమ్ర ప్రణామాలతో తాల్  స్వాగతం పలుకుతోంది... 


ఉత్కళిక :

ధిప్రజుడు తెలుగు కవు
ధిపతి ప్రణవ పీఠము

ఆంధ్ర మురారి, గురు బ్రహ్మ
ఆంధ్ర సుభాషణాజిహ్మ

వీనుల విందు మీ పలుకు
తేనెలొలుకు తెలుగు వెలుగు

కూసు పలుకు సుమ పదముల్
మా సుమధుర స్వాగతముల్

                                        -రాజేష్ తోలేటి 



ఉర్దు తమిళ సిక్కు  గుజరాతి  ఉత్తర
వారు వారి భాష పలికె మురిసె
ఏడ ఉండు మనకు ఏలరా  బీరము
తెలుగు తేజ శ్వేత దేశ  పౌర

తెలుగు లో అపృస్తుత ప్రసంగ ప్రశ్నలు 


1.ఆలస్యం అమృతం  విషం, నిదానమే ప్రధానం 

2. దెయ్యాలకి , భూతాల కి ఛందస్సు అంటే భయమా? మసజసతతగ - శార్దూలా 

3. పండగ పూట  కూడా పాత మొగుడేనా 

4. ఉత్తరానికి, దక్షిణానికి తేడా?

5. అంటార్కిటికా లో ఎక్కడ అవధానం చేస్తున్నారు?

6. 33 కోట్ల  దేవతల పేర్లు ఏమిటి?

 బృహదాకరణ్యకం అనే ఉపనిషత్తు (శాకల్యబ్రాహ్మణం అనే అధ్యాయం) జనకమహారాజు సభలో జరిగిన వేదాంత చర్చను చెబుతుంది. యాజ్ఞవల్క్యుడు అనే బ్రహ్మజ్ఞానితో మిగతా పండితులందరూ దేవుడంటే ఏమిటి అనే విషయమై చర్చిస్తారు. దేవుళ్లు ఎందరు అని కూడా ఒక ప్రశ్న వస్తుంది. యాజ్ఞవల్క్యుడు వేదంలోని మాటనే ఉటంకించి దేవతలు 3,306 అంటాడు. వాళ్లందరూ ఎవరు అనే ప్రశ్నకు వారందరూ కూడా 33 రకాల దేవతల యొక్క అనేక రూపాలు అని చెబుతాడు

7.  భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళందరి పేర్ల చివరా డు ఉంది, ధర్మరాజు కి లేదు..ఎందుకంటే

--------------------------------------------------------

8.  రఘు రాముడు, కోదండ రాముడు, సీతారాముడు  విన్నాగాని . ఈ అనంత రాముడు ఎక్కడ నుండి వచ్చాడు?

9. బ్రహ్మ రాక్షసి  అనీ పేరు ఎలా వచ్చింది? పుష్కర్, రాజస్థాన్ + 5

10.  చారు, దానికా పేరు ఎలా వచ్చింది? నీళ్లు, చింతపండు, ఉప్పు , పోపు 

11. తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ plates, stellar crystals, columns, needles, spatial dendrites, capped columns, and irregular forms

12. గణపతి బప్పా 'మోర్యా'  అనగా ఏమి? మోర్  అంటే నెమలి కదా . మూషికంగారి మనో భావాలు దెబ్బతింటాయేమి కదా 

13.  కన్ను మూశాడు.  కన్నులు మూశారు కాదా?

14. కంగు తినడమేమిటి?

15.అత్తెసరు అంటే అర్థం ఏమిటి? ఈ పదం ఎలా వచ్చింది?

16.చొప్పదంటు ప్రశ్నలు  అంటే ?

17హైలెస్సా అన్న పదానికి అర్థం ఏమిటి? అది ఎలా వచ్చింది?

18. వారాల పేర్లు పురాణాలలో ఉన్నాయా?  Surya Siddhanta is much older(7300 BCE- 7800 BCE). Aryabhatiya appears to be from fifth century CE.

https://nileshoak.wordpress.com/2016/09/04/origin-of-weekday-names/

19.జీబ్రాకు నల్ల చర్మం మీద తెల్ల చారలా , తెల్ల చర్మం మీద నల్ల చారాలా?

20.వరూధిని, ప్రవరాఖ్యుడు- లేపనం -ఇంద్రియ నిగ్రహం 

21.  'అన్నమో  రామచంద్రా'  జాతీయం ఎలా వచ్చింది ?

22. రాక్షసుడికి గుడి ఎక్కడ ఉంది?

23. ముక్కోపి? కన్నుకోపి ,చెవి కోపి ...?

24. బ్రహ్మ ...చతుర్ముఖ పారాయణం సంబంధం?

25. ఇందు వదన కుందరదన మందగమన మధుర వచన గగన జఘన సొగసు లలనవే !

26. యమహో నీ యమా యమా అందం. చెల రేగింది ఎగా దిగా తాపం.

యముడు అందగాడా? ఈ పురాణం లో ఉంది?

27.జగద్గురు విగ్రహ వాక్యం -శ్రీ రామానుజచార్య  jagadguru shankaracharya
28. కంచి గరుడ సేవ అంటే ఏమిటి? బల్లి -గ్రద్ద .... కదా ఏమిటి?

29. సవా అంటే ఏమిటి ? సవా లక్ష?

--------------------------------------------

30.Ratnakaram Satyanarayana Raju gariki |Rani gariki saapatyam emiti?

31.Garilee enduku tinaaali?vinte mahabharathamee vinali

32.Udyog parvam loo evaru evariki vudyogam ichhaaru?

33.నక్కకు నాక లోకానికి ఉన్నంత తేడా?

34. అమూర్త సాధన అభియాంత్రికుడు?(Software Engineer)

35.కిలికించితము:రోషాశ్రుహర్షభీత్యాదుల సంకరరూపమగు స్త్రీ యొక్క శృంగారచేష్టా విశేషము

36.దిడ్డము?

37.కృష్ణ nemali pinhcam lu enni? ee vypu untaayi?

38.ముందుంది ముసళ్ల పండగ లేక

ముందుంది ముసుర్ల పండగ?

39. పొట్టిగా ఉండేవాళ్ళని.. వాడొక "పొట్టి ఠంగణా " అనే వాళ్ళు. టింగణా=పొట్టి జాతి గుఱ్ఱం

40.చంద్రుడిని చందమామ అంటాం కదా...అసలు మామ అని ఎందుకు అంటాం?

41.గీత కార్మికులు

42. గంగ శివుని భార్య --శాంతనుడి  భార్య?

శ్రీనాధుడు చాటువు గంగ వీడు పార్వతి చాలున్ 

సిరిగలవానికి జెల్లును
తరుణులు బదియారు వేలు దగ బెండ్లాడన్
తిరిపమున కిద్దఱాండ్రా
పరమేశా గంగ విడువు పార్వతి చాలున్

43. 

వంగతోటనుండు వరిమళ్ళలోనుండు

జొన్నచేలనుండు చోద్యముగను

తలుపుమూలనుండు తలమీఁదనుండును

దీని భావమేమి తిరుమలేశ?

44. దెయ్యం  VS  కొరివి దెయ్యం 

45. భూతం vs పిశాచం 

46. ఆత్మ  vs  ప్రేతా త్మ 

47.  అద్వైతం నుండి  ద్వైతం వచ్చిందా?

48. అవలక్షణం, అవమానం, అవధానం 

49.దుర్మార్గం , దుర్ముహర్తము, దుశ్శాలువా