ప్రణవపీఠాధీశులు, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి
గౌరవాభిమానాలతో సమర్పించుకుంటున్న
ప్రశంసా పత్రం
కవితా సౌరభము వెలయించు కల్పతరువై
వాగ్విలాసమున సమస్తజన సమ్మోహనకారుడువై
జ్ఞాన గంగతో, బుధజన హృదయ దాహార్తి తీర్చెన్.
అవధాని కళామణి, మీరు సారస్వత దీపమై
విద్యా వినయమును విరాజిల్లెన్ మమ్ము ప్రకాశింపఁన్ !
మధుర సమ్మిళిత భాషణ, శ్రోతల ఆనందమై,
సాహిత్య సముద్రమున విహార యాత్రగావించెను
మీ ప్రతిభా పాటవము సర్వదా స్ఫూర్తి దాయకమై
అవధాన సాహితీ సౌరభము చిరస్థాయిగా,
శశికిరణముల సంగమున విలసిల్లు మహా అంబుజమై!
No comments:
Post a Comment