Saturday, 22 March 2014

లండన్ హైకూలు

హైకూ


హైకూ జపనీస్ సాహిత్యంలో విశేష ఆదరణ పొందిన  కవిత్వ ప్రక్రియ. ఇది 15వ శతాబ్దం నుండి వెలుగులోకి వచ్చింది.
ఇంత పురాతన చరిత్ర కలిగా ఉన్నా, సంక్షిప్తంగా ఉండటం వలన ఆధునిక పాఠకులకు కూడా చేరువ అయ్యింది.
మనం ఇప్పుడు ఒకసారి  హైకు నిర్మాణం గురించి, కొన్ని ఉదాహరణలు చూద్దాము.

హైకు నిర్మాణం చాలా తేలికగా ఉంటుంది.
1.
హైకూ మూడు పాదాలలో పదిహేడు 'మాత్రలు '( సిలబుల్స్) కలిగిన త్రిపద.
2.
మొదటి పాదంలో ఐదు, రెండో పాదంలో ఏడు, మూడో పాదంలో ఐదు చొప్పున మాత్రలు ఉంటాయి.
3.
రెండు వేరువేరు విషయాలు విశ్లేషించబడతాయి.
4.
ఒక ఋతువుకి  సంబంధించిన పదం  ఉంటుంది

అదృష్టవశాత్తు ఇస్మాయిల్  గారు ఈ ప్రక్రియ ని తెలుగుకి పరిచయం చేశారు.
ప్రముఖ సాహితీ కారులు  వాడ్రేవు చినవీరభద్రుడు మాటలలో చెప్పాలంటే  "మానవాత్మనీ, భూమ్యాకాశాల్ని, వెలుగు నీడలను ఒకే స్నాప్ షాట్ లో పట్టే ప్రక్రియ".

మొదట్లో  పైన చెప్పబడిన  నియమాలు అనుసరించెను,  రానురాను తెలుగులో ఆ కూర్పు పాటించట లేదు.

ఉదాహరణ (సంప్రదాయ హైకు ):

సమీక్షకుడు
పచ్చి పాల మీగడ
వెతికే అత్త
-
పెన్నా శివరామకృష్ణ

ఉదాహరణ (ఆధునిక హైకు ):

వాగు ప్రవాహానికి
అన్నీ కొట్టుకుపోతున్నాయి
చంద్రుడు తప్పించి
-
తలతోటి పృథ్విరాజ్


ఈ తరహాలో  లండన్ (UK)  నేపథ్యంలో కొన్ని స్వీయ హైకులు.



 
నల్ల మబ్బులు
 
లండన్ మూల మూలాల్లో 
 
పొమ్మంటున్నాయి .

రంగు రంగుల్లో
మధ్య జేగురు రంగు
కలల వర్షం.

 
వీపింగ్ విల్లో
ప్రొద్దు అందాలరాశి
రాత్రి  దెయ్యాల మర్రి .

హంతకులకి
స్వర్గం ఎవడు ఇస్తాడో!
చెప్పింది ఎవరో?





Tuesday, 18 March 2014

విలోమ కావ్యాలు

  మనలో చాలామందికి  PALINDROME అంటే తెలుసు.కాని కొన్ని కావ్యాలు సంపూర్ణంగా ఈ తరహాలో ఉన్నాయ్ అంటే ఆశర్యం కలగక మానదు. అందులోన ఈ ప్రక్రియ మన సంస్కృతంలో ఆవిర్భవించింది అంటే గర్వ పడక తప్పదు. ఇంత వరుకు మరే ఇతర భాషలో ఈ రకమైన పుస్తకాలు ఉన్నట్లు కనపడదు.

                        క్రీ శ  14 శతాబ్దంలో  శ్రీ  సుర్యదాస అనే పండితుడు  అహ్మదనగర్  సామ్రాజ్యం లో,  పార్తాపూర్ అనే ఊరిలో ఉండేవాడు.  ఆయన రచించిన 'రామకృష్ణ విలోమ కావ్యం' లో  40 పద్యాలు ఉన్నాయి. వాటి విశేషం ఏమిటంటే ముందు నుండి చదివితే రామాయణం, చివరనుండి ముందుకు చదివేతే భారతం గోచరిస్తాయి.
కుడి నుండి  ఎడంకి  చదివే భాషలు అరబిక్,పర్శియను బహుశా ఆ కాలంలో  ఈ కవి ని ప్రభావితం  చేసి ఉండవచ్చునని చరిత్ర కారుల అభిప్రాయం. ఈ వ్యాసం చివరలో ఒక  పద్యాన్ని విశ్లేషిద్దాం.
       
                      ఇదే విధంగా శ్రీ వెంకట కవి  క్రీ శ  1650 ప్రాంతంలో 'శ్రీ రాఘవ యాదవీయం' అనీ పుస్తకాన్ని విరచించారు. మన అదృష్టం  ఏమిటంటే ఈ కావ్యాలు రెండు మనకు లభ్యం అవడం. ఇవి కాకుండా  చిదంబర కవి రచించిన 'శబ్దచిoతామణి ' , రచయిత  ఎవరో  తెలియని 'నల హరిచంద్రియ' ఈ కోవలో కి వచ్చే  అద్బుత కావ్యాలు.
ఇంతకు పూర్వమే ఈ విధమైన ప్రయోగాలు 'కిరాతర్జునియం', 'శిశుపాలవధ' లాంటి ప్రభంధములలో  ఉన్నా అవి ఒక పద్యానికి లేదా ఒక శ్లోకానికి  పరిమితం అయినవి. అందుచేత శ్రీ సూర్యదాస కవిని విలోమ కావ్య పితామహుడు  అనవచ్చు.


 ఒక పద్యాన్ని చూద్దాం :

 తం భూసుతాముక్తిముదారహాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీ:

ఈ పాదాలని తిప్పి వ్రాస్తే ...

శ్రీయాదవం భవ్యభతోయదేవం
సంహారదాముక్తిముతాసుభూతం


మొదటి  పద్యం  సీతా దేవిని స్తుతిస్తే , రెండవ పద్యం కృష్ణ భగవానుడి గీత భోదని వర్ణిస్తుంది.

 మన తెలుగుకి అత్యంత దగ్గరిగా ఉండే సంస్కృత భాష ఎంత గొప్పదో కదా !
 



Friday, 14 March 2014

చిన్న మాట

నవ్య తారలే సుదూర స్వప్న గీతికలయై
వీనులవిందు సేయగా కావ్య కన్నెవై
నడిచి రావే, కరగని ఈ చీకటి
రేయిని కడలిలో కలిపే కమనీయ
ఖజరహో అందంలా కదిలి రావే!

Wednesday, 31 March 2010

మరదలి పెళ్లి


యధావిధిగా శనివారం ఇంటికి ఫొన్ చేసా. అమ్మ అందుకుంటూనే "ఓరేయ్ నీకో good news" అంటూ ఒక గావు కేక పెట్టింది. ఒక్కసారి ఉలిక్కి పడ్డా నాకు ఎమ్యెనా పెళ్ళి చూపులు ఏర్పాటు చేసారెమూ అని. వెంటనే నా software సహేళి (అదే కొలీగు) "మహి" గుండెల్లో తన్నినట్లు అనిపించింది.
అమ్మ :"నీ మరదలు లలిత పెళ్లి కుదిరిందిరా, May 16 ".
హమ్మాయ అనుకుని " నాకు good news ఎంటే దానికి పెళ్లి కుదిరితే !"
అమ్మ: "అదేలేరా అందరికి మంచిదే కదా"
అసలు ఈ "నీకో Good news" పద ప్రయొగమే నాకు నచ్చదు. దానికో flash back ఉంది. నా MCA classmate, close friend సంధ్య Hyderabad లొనే ఉంటుంది. మా 'ofifce' కి దగ్గరే వాళ్ల ఇల్లు. రెండేళ్ల క్రితమే పెళ్లి అయ్యింది. పెళ్లి అయ్యాక ఉద్యోగం ఏమి చెయ్యలేదు. అప్పుడప్పుడు వాళ్ళింటికి లంచ్ కూ/ డిన్నర్ కూ వెళ్లేవాడిని గాబట్టి సంధ్య వాళ్ల ఆయన కిరణ్ కూడా బాగానే పరిచయం.ఎమీ తోచకపోతే సంధ్య సాయంత్రం మా ఆఫీసు కి వస్తే ఏ 'CoffeeDay' కో , బేకరి కో వెళ్ళే వాళ్ళం. కిరణ్ కి చెబితే అయిష్టం గానే ఒప్పుకోనేవాడు అని ఒక సారి చెప్పింది.
ఒక ఆదివారం సాయంత్రం ఫోన్ చేసింది.మంచి ఉత్సహంగా "నీకో GoodNews" అంది. నేను, నాకు గుడ్ న్యూస్ అయతే ముందు సంధ్య కి ఎలా తెలిసింది అబ్బా అని ఆశ్చర్య పోతు త్వరాగా చెప్పు అన్నా.కొద్దిగా సిగ్గుపడుతూ "I am going to have baby in 6 months time" అంది. నిజం చెప్పాలి అంటే అది విని కొద్దిగా "SHOCK" తిన్నా. వాళ్ళ అయీనికి చెప్పినట్టు చెప్పింది ఏమిటిరా అనుకున్నా. తర్వాతా తెలిసింది ఏంటి అంటే, ఆ ఫోన్ చేసినప్పుడు ప్రక్కనీ వున్నా కిరణ్ కి కూడా అలాగే అనిపించి , వాళ్లిదరి మధ్య కొద్దిపాటి "DISCUSSION" కూడా జరిగింది అని. అప్పడి నుంచి ఎప్పుడు కిరణ్ ని కలిసినా నన్ను కొద్దిగా అనుమానంగా చూస్తున్నట్లు నాకు అనిపించేది.
అందువలన "నీకో GOOD NEWS" పద ప్రయోగం జాగ్రత్తగా ఉపయోగించాలని నాకు బలమయన నమ్మకము. ఏమంటారు?

         ఫ్లాష్ బ్యాక్ లోంచి  ప్రస్తుతానికి వస్తే .. ఇంకా పది రోజులే  పెళ్లికి (అదేలెండి  మరదల పెళ్లి ) కి టైం ఉంది. లీవ్ అడిగితే , బాస్ రాక్షసుడు  ఏమంటాడ అని లో లోపల భయంగానే ఉంది.వాడు (మాములుగా  మంచి వాడె   గానీ, బాస్ ని  'వాడు' అనకపోతే కిక్  రాదు కదా!)

           (ఇంకా ఉంది )

Friday, 20 February 2009

మరో ప్రస్థానం (With Apologies to Sree Sree)


పదండి Site కు,
పదండి Chat కు!
పోదాం, పోదాం లో లో కి!

లాప్ టాప్ నో,
డెస్క్ టాప్ నో,
ఇంటెర్నెట్ కి కనక్ట్ చేసుకొని
లాగ్ ఇన్ అయిపోదాం,
తెలియట లేదా
సైబర్ ప్రపంచం రహదారి?

ఎంత సేపైనా, కంటి నొప్పైనా
లెక్క చెయ్యకుండా పదండి లోపలికి!
Siteలు చూస్తూ,
Blogs చదువుతూ,
విజ్ఞానాన్ని పొందడి.
Virusలు, Wormలు,
Spywareలు,
Spam mail
లులా మనకడ్దం?

పదండి Site కు,
పదండి Chat కు!
పోదాం, పోదాం లో లో కి!

Friday, 16 January 2009

2009 కి ఒక మధ్య తరగతి,మధ్య వయస్కుడి స్వాగతం (స్వగతం)

నవ్వుతూ, త్రుళ్లుతొ వస్తోంది క్రొత్త సంవత్సరం
నసుగుతూ, సణుగుతూ పోరుతూంది పాత పెళ్ళాం
నల్లగా నిగనిగాలడి, గాలికి ఊయలలు ఊగిని జుట్టు ఊడుతోంది
"6 పేకలా " ఉండే ఉదరం "పంచ్ బాగ్" లా ఉబ్బుతోంది
కాలం కరుగుతోంది-- వయస్సు ముదురుతోంది!
నూతన సంవత్సరానికి స్వాగతం! సుస్వాగతం!!

Thursday, 15 January 2009

సంక్రాంతి


కనపడట లేదు చిన్న నాటి నులి వెచ్చని భొగి మంటలు, తీ తీపి పిండి వంటలు,
వినపడుతున్నై నానటికి పెరుగుతున్న "క్రెడిట్ క్రంచులు" , అంతు లేని "'జాబ్ కట్" లు
ఆ రోజులలో ఆంతఃపురాలలో అలరారే వారు మారాజులు
ఈ రోజులలో కటకటాలలో కిటకిట లాడుతున్నారు ఈ "రాజులు"
సంక్రాంతి వచ్చింది :: ప్యత్యాన్ని పెంచింది !!
సంక్రాంతి వచ్చింది :: సత్యాన్ని ముంచింది !!!