విలోమ కావ్యాలు
మనలో చాలామందికి PALINDROME అంటే తెలుసు.కాని కొన్ని కావ్యాలు సంపూర్ణంగా ఈ తరహాలో ఉన్నాయ్ అంటే ఆశర్యం కలగక మానదు. అందులోన ఈ ప్రక్రియ మన సంస్కృతంలో ఆవిర్భవించింది అంటే గర్వ పడక తప్పదు. ఇంత వరుకు మరే ఇతర భాషలో ఈ రకమైన పుస్తకాలు ఉన్నట్లు కనపడదు.
క్రీ శ 14 శతాబ్దంలో శ్రీ సుర్యదాస అనే పండితుడు అహ్మదనగర్ సామ్రాజ్యం లో, పార్తాపూర్ అనే ఊరిలో ఉండేవాడు. ఆయన రచించిన 'రామకృష్ణ విలోమ కావ్యం' లో 40 పద్యాలు ఉన్నాయి. వాటి విశేషం ఏమిటంటే ముందు నుండి చదివితే రామాయణం, చివరనుండి ముందుకు చదివేతే భారతం గోచరిస్తాయి.
కుడి నుండి ఎడంకి చదివే భాషలు అరబిక్,పర్శియను బహుశా ఆ కాలంలో ఈ కవి ని ప్రభావితం చేసి ఉండవచ్చునని చరిత్ర కారుల అభిప్రాయం. ఈ వ్యాసం చివరలో ఒక పద్యాన్ని విశ్లేషిద్దాం.
ఇదే విధంగా శ్రీ వెంకట కవి క్రీ శ 1650 ప్రాంతంలో 'శ్రీ రాఘవ యాదవీయం' అనీ పుస్తకాన్ని విరచించారు. మన అదృష్టం ఏమిటంటే ఈ కావ్యాలు రెండు మనకు లభ్యం అవడం. ఇవి కాకుండా చిదంబర కవి రచించిన 'శబ్దచిoతామణి ' , రచయిత ఎవరో తెలియని 'నల హరిచంద్రియ' ఈ కోవలో కి వచ్చే అద్బుత కావ్యాలు.
ఇంతకు పూర్వమే ఈ విధమైన ప్రయోగాలు 'కిరాతర్జునియం', 'శిశుపాలవధ' లాంటి ప్రభంధములలో ఉన్నా అవి ఒక పద్యానికి లేదా ఒక శ్లోకానికి పరిమితం అయినవి. అందుచేత శ్రీ సూర్యదాస కవిని విలోమ కావ్య పితామహుడు అనవచ్చు.
ఒక పద్యాన్ని చూద్దాం :
తం భూసుతాముక్తిముదారహాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీ:
ఈ పాదాలని తిప్పి వ్రాస్తే ...
శ్రీయాదవం భవ్యభతోయదేవం
సంహారదాముక్తిముతాసుభూతం
మొదటి పద్యం సీతా దేవిని స్తుతిస్తే , రెండవ పద్యం కృష్ణ భగవానుడి గీత భోదని వర్ణిస్తుంది.
మన తెలుగుకి అత్యంత దగ్గరిగా ఉండే సంస్కృత భాష ఎంత గొప్పదో కదా !
తం భూసుతాముక్తిముదారహాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీ:
ఈ పాదాలని తిప్పి వ్రాస్తే ...
శ్రీయాదవం భవ్యభతోయదేవం
సంహారదాముక్తిముతాసుభూతం
మొదటి పద్యం సీతా దేవిని స్తుతిస్తే , రెండవ పద్యం కృష్ణ భగవానుడి గీత భోదని వర్ణిస్తుంది.
మన తెలుగుకి అత్యంత దగ్గరిగా ఉండే సంస్కృత భాష ఎంత గొప్పదో కదా !
No comments:
Post a Comment