Monday, 21 March 2016

London Mayasabha

-------------------------------------------దుర్యోధనుడు  మయసభ ఏకపాత్రాభినయం  -------------------------------


(చుట్టూ చూసి  - ఆశ్చర్యానందములతో)
ఆహా ఏమి ఈ నందన వనం! సుందర నగరం! ఒక వైపు ఆకాశహర్మ్యాలు మరో వైపు  సాంప్రదాయ గృహ సమూహాలు! ఒకవైపు యంత్ర రధములు, మరో వైపు అశ్వరోహులు.
(ప్రేక్షకులని  చూసి )
తెల్ల వారు, నల్ల వారు  అందరిని మించి  మన భారత సోదరసోదరిమణులతో,  రంగురంగులతో  ఈ దేశం అలరారుతున్నదే!
(బిగ్ బెన్ ని చూసి )
ఏమి  ఏమేమి,  గోడ గడియారం  భవనం పైన ఉన్నది? (చుట్టూరా తిరిగి ) నాలుగు వైపులా  నలుగు కాల మానము లా? అయ్యారే! మన రాజ మందిరం పైన కూడా ఇలాంటిడి ఒకటి ఉండ వలె!
(లండన్ బ్రిడ్జి  చూసి )
ఇది వంతెనాయా? వారధియా ? తెరుచుకోనుచున్నది , మూసుకోనుచున్నది! నా చిత్తభ్రమ కాదు కదా !
(గట్టిగా నవ్వి ) మన గంగా నది పైన కూడా  ఈ  మాదిరి వంతెన  నిర్మించ వలె!

(London eye ని చూసి) దుర్యొధనుదు: ఏమి ఏమిమి! కృష్ణ  బావ సుదర్శ చక్రం విశ్వరూపం చూపించున్నది! ఇది దుశ్శకునం కాదు కదా! (తేరపారి  చూసి).  ఈ  చక్రమునకు చిన్న చిన్న గదులు వాని లో మనుషులూనా! వాహ్వా! ఎవరు రూపిందించిరో, మయుని మరిపించిరి, మమ్ము మురపించిరి!
(వాక్స్ museum)

నాలుగు అడుగులు వేసి....గాంధి మహత్ముడుసచిన్ టెందుల్కర్ సంభాషిస్తునారేమి!
మనము కూడా ముచ్చటించదము 
(వారి దగ్గరికి వెళ్లి ) ఏమి ఏమేమి, ఏవి కేవలం మైనపు శిల్పములా! ఆ నాటి మయసభలో   సాలభంజికలను  మించి కన్నులను మాయ చేయుచున్నవి. ఎవరీ అపరబ్రహ్మ? 
ఈ సుయోధుని  విగ్రహం కూడా ఉండిన ఈ సాలభంజిక సభకు నిండుదనం వచ్చును.(వికటాట్టహాసం )
(ట్యూబ్ ని చూసి )
ఏమి  ఈ శకటం! అశ్వం లేదు! చోదుడూ లేదు. (రెండు అడుగులు వెనక్కి వేసి ) దశ  శకటంలు ఒక దానికి మరొకటి జోడించితిరి. ఒరోరి ఇది  ఏమి! సొరంగ మార్గము లోకి  తుర్రుమంటున్నది!
దీనిని సొరంగవిద్యత్యంత్రదశశకటం అనవలనెమో!

మయ సభని మిoచి - సంబ్రమాశ్చర్యములో ముంచి,
ఆనందడోలికలలూగించి - కల నిజములిని ఏకము  చేయుచున్నది
ఈ లండన్ నగరము , ఇచ్చట ఉండుటయే  ఒక గౌరము !!!

------------------------------------------------------------------------------------------------------------------

MBS ప్రసాద్ గారి తో కబుర్లు



                                                             శ్రీ MBS ప్రసాద్ గారి తో  కబుర్లు

 శ్రీ MBS ప్రసాద్ గురించి  క్లుప్తంగా  చెప్పాలంటే  ఆంగ్లాoధ్ర లలో కధా రచయత, వ్యాస రచయత, అనువాదకుడు, సంపాదకుడు,రేడియో జాకీ , టీవీ యాంకర్, శీర్షికా నిర్వాహకుడు. కీర్తి  పురస్కారం, నంది అవార్డు , అనేక సార్లు కధలకి బహుమతులు పొందారు. ఈ రకముగా వీరి సాహతీవ్యవసాయం  బహుముఖాలుగా సాగుతున్నది .
              UK లో ఉన్న తెలుగు వారికి సాహితీ సౌరభాలు అందిచాలానే ఉద్దేశ్యంతో తాల్‌, సిపి బ్రౌన్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా MBS ప్రసాద్ గారి తో   డిసెంబర్ 12న (2015)  Hounslow  లో  ఈ  కబుర్లు  కార్యక్రమం నిర్వహించడం జరిగినది.  రాజేష్  తోలేటి గారి    శ్రీ MBS పరిచయంతో   మొదలయిన సభ జనరంజకమ గా సాగినది. ముఖా ముఖిగా  రాజకీయ, సామాజిక, సాహిత్య  సంభాషణలతో ఆద్యంతం ఉత్సాహంగా నడిచింది. సుదూర తీరలనుండి శ్రోతలు వచ్చి వివిధ కోణాలలో ప్రసాద్ గారికి ప్రశ్నలు సంధించారు. ఆయన నేర్పుగా, ఓర్పుగా సమాధానులు చెప్పి రక్తి కట్టించారు .
 చివరిగా తాల్  వ్యవస్థాపకులు శ్రీ రాములు, శ్రీ రామనయాడు, ఛైర్మన్  శ్రీ సత్యేంద్ర  మరియు తాల్ ట్రస్టీలు   MBS గారిని సన్మానించారు.

ఈ కార్యక్రమం గురించి ఆయన మాటల్లోనే
"కితం ఏడాది అనుకోకుండా యుకె వెళ్లడం, లండన్‌లో తాల్‌, సిపి బ్రౌన్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావడం జరిగాయి. వ్యక్తిగత పనులపై వచ్చి కుటుంబసభ్యులతో వున్నాను కాబట్టి పైన చెప్పిన మొహమాటాలేవీ లేవు. ఉదయం నేనుండే కొవెంట్రీ నుంచి గంట రైలు ప్రయాణంతో లండన్‌ చేరడం, మీటింగుకి హాజరు కావడం జరిగాయి. నిర్వాహకులు ఆ రాత్రి బస ఏర్పాటు చేయడమే కాక, ఆ రోజు రెండు ముఖ్యప్రదేశాలు, మర్నాడు నాలుగు దర్శనీయ స్థలాలు చూపించారు. నేను ఫుల్‌ ఖుష్‌. సభకు ఆశించినదాని కంటె రెట్టింపు జనం రావడంతో వాళ్లు ఖుష్‌. మీటింగు తర్వాత కూడా ఓ యిరవై మంది నాతో రెండున్నర గంటల పాటు బాతాఖానీ వేశారు. అంతమంది రావడానికి కారణం ఏమిటాని విశ్లేషించి చూస్తే తేలిందేమిటంటే - నాకున్న గుర్తింపు సాహితీకారుడిగా కాదు. వారిలో నేను రాసిన కథలు చదివినవారు ఎక్కువమంది లేరు. రాజకీయ, సామాజిక విశ్లేషకుడిగా నాకున్న యిమేజి, గ్రేట్‌ ఆంధ్రా వంటి పాప్యులర్‌ వెబ్‌సైట్‌ ద్వారా నా పేరు అందరికీ తెలియడం చేతనే అంతమంది వచ్చారు. పైగా మీటింగు జరిగిన తీరు కూడా విలక్షణంగా వుంది. పది నిమిషాలలో నా పరిచయం ముగిసిన తర్వాత అప్పణ్నుంచి రెండున్నర గంటల పాటు నేను కబుర్లు చెపుతూ, ప్రశ్నలకు సమాధానాలు చెపుతూనే వున్నాను. ఉపన్యాసమైతే భోజనానంతరం ఆవలించకుండా వినడం మహా కష్టం. నావి యింటరాక్టివ్‌గా వుండే కబుర్లు కావడంతో, వచ్చినవాళ్లంతా అలర్ట్‌గా, ఉత్సాహంగా వున్నారు. నేనూ యిలాటి ప్రయోగం గతంలో చేయలేదు. కష్టపడి, సమయం వెచ్చించి వచ్చినవాళ్లను నిరాశపరచనందుకు నేను ఆనందించాను."


మరో ప్రస్థానం

(శ్రీ శ్రీ అభిమానులకి క్షమాపణల తో )
సైబర్  ప్రపంచం,
సైబర్  ప్రపంచం,
సైబర్ ప్రపంచం పిలిచింది!
స్మార్ట్ ఫోన్ లో వాట్సప్ప్ తో,
ఐపాడ్ లో ఫేసు బుక్కు తో !
పోదాం, పోదాం లో లో కి!

లాప్ టాప్ నో,
డెస్క్ టాప్ నో,
వైఫ్యె కి  కనక్ట్ చేసుకొని
లాగ్ ఇన్ అయిపోదాం!
తెలియట లేదా
సైబర్ ప్రపంచం రహదారి?

ఎంత సేపైనా, కంటి నొప్పైనా
లెక్క చెయ్యకుండా తెగ తిరేగేద్దం !


చాట్ లు చేస్తూ,

సైట్లు  చూస్తూ,
దారి పొడుగునా
దూరం వాళ్ళకి  దగ్గర అవుతూ,

దగ్గర వాళ్ళకి  దూరం అవుతూ!

వైరస్లూ, వార్మలు,
స్పై వేరులు ,
స్పామ్లు  మెయిల్ లా మనకడ్డం?పదండి సైట్కు,
పదండి చాట్కు!
పోదాం, పోదాం లో లో కి!

TCC

TAL  ఆధ్వర్యములొ మన తెలుగు పిల్లలకి తెలుగు భాష, సంస్కృతి , సంప్రదాయాలను మరియు భారతీయ కళలను అందిచాలనే ధ్యేయంతో రెండు సాంస్కృతిక  కేంద్రాలు  పని చేస్తున్నాయి.
 1. Telugu Cultural Center (TCC) West

2. Telugu Cultural Center (TCC)  East 

గత 6 సంవత్సరాలుగా నిరాటంకగా  ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య  కారణం  తల్లి తండ్రుల ఆసక్తి, నిర్వాహకుల సామర్ధ్యం.  ఇక్కడ సంగీతం , భరత్ నాట్యం నేర్చుకుంటున్న చిన్నారులు  అనేక ప్రదర్శనలు ఇస్తూ ఉన్నరు. కేవలం తాల్ కి సంభందించిన వేడుకులలోనే  కాకుండా ఇతర సంస్థలనుండి వచ్చిన ఆహ్వానాలని అందుకొని, వారి సమావేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు. ఇది  ఆయా గురువుల సామర్ధ్యానికి , శిష్యుల చిత్తశుద్ధికి  నిదర్శనము.
ముఖ్యంగా 'చిల్డ్రన్స్ డే ' నాడు తాల్ సమావేశాలలో   TCC పిల్లలదే 'హవా ' అంటే అతిశయోక్తి కాదు.
పిల్లలని చూసి వారి తల్లి తండ్రులు కూడా ఈ కళల్ని అభ్యసించడం అనుకోని పరిణామం!
వారు కూడా  ఈ  కళల్ని ప్రదర్శించడం   ముదావహము!!
                   ప్రస్తుతం తెలుగు, కర్ణాటక సంగీతం, భరతనాట్యం తరగతులు  నిర్వహించడం జరుగుచున్నది.
ఆసక్తి ఉన్నవారికి కూచిపూడి , బాలీవుడ్ , తబలా వంటి తరగతులు  ఏర్పాటు  చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్రమశిక్షణ తో మీ పిల్లలకి  మన  తెలుగు భాష ని, కళల్ని  అందిస్తున్న మమ్మలిని ప్రోత్సహించండి!
మరిన్ని వివరాల కోసం వెంటనే  తాల్ ని  సంప్రదించండి!



ఉపాధ్యాయులు:

కర్ణాటక సంగీతం: శ్రీ వీణాపాణి
తెలుగు: శ్రీ రాజేష్ తోలేటి
భరతనాట్యం:శ్రీ  అనమిహ

                              తెలుగు జాతి మనది  నిండుగా  వెలుగు జాతి మనది!!!

Friday, 15 May 2015

Sri ranga Pranava Upnayanam

శ్రీ కృష్ణని   అనుగ్రహం, రామనుజలవారి అనుద్యానము మా ఇంట
రం ఉపనయన వేడుకులికి బంధు మిత్ర సపరివార సమేతంగా, 
రంగరం  వైభవంగా విచ్చేసి, మా సత్కారా  తాంబూలములు
స్వీకరించి,  ప్రమదించి, మా గృహ  దైవం రామనుచారుల్య వారి
కీర్తనలో వారి చరణ  సాక్షిగ  జరగనున్న ఈ పవిత్ర  కార్యాన్ని 
 వీక్షించి,   మా    ప్రణవ్ని ఆశ్వీరదించలని  ఆశిస్తూ ..... 



Wednesday, 29 April 2015

60 years wedding anniversary


కావ్య కుసుమాలే సాక్షిగా  చేతిలో  చెయ్యేసి చేసిన   బాస
శీతల మారుతాలవలె  మెల్ల మెల్లగా పరస్పర  అంగీకుర్వా
విజయాలతో   ఆదర్శ ఆలుమగలగా  బాసిల్లిన వీరు  అధి
శ్వర  ఆశీర్వాదమతో  కలకాలం ఇలా సుఖసంసార   లాల
నా  పాలనలతో  విరజల్లాలని ఆకాంక్షిస్తూ, విశ్వనాథ  లక్ష్మి
దంపతులు  శత  వసంతాలు వర్ధిల్లాలని   ఆశిస్తూ ...

Friday, 27 February 2015

TAL- Badminton



బాడ్మింటన్ అనగానే మనం అది CHINEESE ఆట అనుకుంటాం. కాని నిజానికి ఇది మన భారత దేశంలో పుట్టిన క్రీడ . దీని మూలాలు తమిళనాడులో తంజావూర్ రాజుల కాలంలో ఆడిన ఆట నుండి వచ్చాయి అనవచ్చు. ఇంచుమించు అదే కాలంలో బ్రిటిష్ మిలిటరీ వాళ్ళు పూణే  ప్రాంతంలో ఇదే విధంగా ఆడారు . ఏది ఏమయినా బాడ్మింటన్ ముమ్మాటికి మన దేశంలో ఆవర్భించిన అద్బుతమైన ఆట .

 TAL 2012 నుండి UK స్థాయిలో  మన తెలుగు వారికీ ఈ పోటీలు విజవంతంగా ప్రతి ఏడాది నిర్వహిస్తోంది.

 మన తెలుగు వారికి ఇష్టమైన  ఈ అటని మనవాళ్ళతో  ఆడుకోడానికి ఒక వేదిక ఉంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతో TAL ప్రప్రధమగా 2012 లో TAL UK NATIONAL CHAMPIONSHIP ప్రారంభిచారు.మొదటి విడతగా 7 కేంద్రలలో 7 మినీ టోర్నమెంట్లు,  అక్కడ నుండి 40 జట్టులుని  మెగా ఫైనల్ కి తెసుకొని అత్యంతః వైభవంగా లండన్లో  నిర్వహించారు.

2013 లో నిర్వహణ సౌలభ్యం కోసం ఈస్ట్ , వెస్ట్  జోనులుగా విభజించి అర్హత టోర్నమెంట్లు నిర్వచించారు. వారిలో  40 జట్టులను మెగా ఫైనల్  ఆడించారు . ఇదే  సంవత్సరం తెలిగింటి ఆడపడుచులికి మిక్స్డ్ డబుల్స్ రూపంలో  వారి సత్తా చూపడటానికి అవకాశం కల్పించారు.

2014 లో జరగిన ఛాంపియన్షిప్ కి  భారత్ బాడ్మింటన్ కోచ్, ex  ALL ENGLAND OPEN CHAMPION  గోపీచంద్ స్వయంగా వచ్చి విజేతలకి  పతకాలు అందచేసారు. ఆయన ఇచ్చిన సందేశం రానున్న తరాలిని కూడా విజపథం వైపు నడిపిస్తుందని చెప్పవచ్చు.

2015 ఛాంపియన్షిప్ లో  ఈస్ట్, వెస్ట్ జోన్స్ నుండి ఎన్నిక కాబడిన  32జట్టులు హోరా హోరిగా  పోరాడాయి .




2012 :      విజేతలు  యిశ్రీ(టిల్లు) కలికిరి, కృష్ణ
                ద్వితీయ స్థానం: సుధాకర్ గుబ్బల,కమలకాంత్ బెహార

2013 :      విజేతలు - సుధాకర్ ఆకవరపు, యిశ్రీ(టిల్లు) కలికిరి
                ద్వితీయ స్థానం: సుధాకర్ గుబ్బల, రాకేష్ బోరంచ

                మిక్స్డ్ డబుల్స్ విజేతలు: రాజేష్ తోలేటి, పద్మిని
               

2014 :      సంయుక్త విజేతలు - రాజేష్ తోలేటి, కేశ్ నాయుడు 
                                              వెంకట్ ఉండవల్లి, సాయినాథ్
                మిక్స్డ్ డబుల్స్ విజేతలు: ప్రతీక్, పద్మిని

 2015:    విజేతలు - సుధాకర్ గుబ్బల, రాకేష్ బోరంచ
              ద్వితీయ స్థానం: శ్రీరామ్ గిడుగు, వంశీ గోవిందు

             మిక్స్డ్ డబుల్స్ విజేతలు:సురేష్ బిక్కిన , రజని చేకూరి