Monday, 21 March 2016

MBS ప్రసాద్ గారి తో కబుర్లు



                                                             శ్రీ MBS ప్రసాద్ గారి తో  కబుర్లు

 శ్రీ MBS ప్రసాద్ గురించి  క్లుప్తంగా  చెప్పాలంటే  ఆంగ్లాoధ్ర లలో కధా రచయత, వ్యాస రచయత, అనువాదకుడు, సంపాదకుడు,రేడియో జాకీ , టీవీ యాంకర్, శీర్షికా నిర్వాహకుడు. కీర్తి  పురస్కారం, నంది అవార్డు , అనేక సార్లు కధలకి బహుమతులు పొందారు. ఈ రకముగా వీరి సాహతీవ్యవసాయం  బహుముఖాలుగా సాగుతున్నది .
              UK లో ఉన్న తెలుగు వారికి సాహితీ సౌరభాలు అందిచాలానే ఉద్దేశ్యంతో తాల్‌, సిపి బ్రౌన్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా MBS ప్రసాద్ గారి తో   డిసెంబర్ 12న (2015)  Hounslow  లో  ఈ  కబుర్లు  కార్యక్రమం నిర్వహించడం జరిగినది.  రాజేష్  తోలేటి గారి    శ్రీ MBS పరిచయంతో   మొదలయిన సభ జనరంజకమ గా సాగినది. ముఖా ముఖిగా  రాజకీయ, సామాజిక, సాహిత్య  సంభాషణలతో ఆద్యంతం ఉత్సాహంగా నడిచింది. సుదూర తీరలనుండి శ్రోతలు వచ్చి వివిధ కోణాలలో ప్రసాద్ గారికి ప్రశ్నలు సంధించారు. ఆయన నేర్పుగా, ఓర్పుగా సమాధానులు చెప్పి రక్తి కట్టించారు .
 చివరిగా తాల్  వ్యవస్థాపకులు శ్రీ రాములు, శ్రీ రామనయాడు, ఛైర్మన్  శ్రీ సత్యేంద్ర  మరియు తాల్ ట్రస్టీలు   MBS గారిని సన్మానించారు.

ఈ కార్యక్రమం గురించి ఆయన మాటల్లోనే
"కితం ఏడాది అనుకోకుండా యుకె వెళ్లడం, లండన్‌లో తాల్‌, సిపి బ్రౌన్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావడం జరిగాయి. వ్యక్తిగత పనులపై వచ్చి కుటుంబసభ్యులతో వున్నాను కాబట్టి పైన చెప్పిన మొహమాటాలేవీ లేవు. ఉదయం నేనుండే కొవెంట్రీ నుంచి గంట రైలు ప్రయాణంతో లండన్‌ చేరడం, మీటింగుకి హాజరు కావడం జరిగాయి. నిర్వాహకులు ఆ రాత్రి బస ఏర్పాటు చేయడమే కాక, ఆ రోజు రెండు ముఖ్యప్రదేశాలు, మర్నాడు నాలుగు దర్శనీయ స్థలాలు చూపించారు. నేను ఫుల్‌ ఖుష్‌. సభకు ఆశించినదాని కంటె రెట్టింపు జనం రావడంతో వాళ్లు ఖుష్‌. మీటింగు తర్వాత కూడా ఓ యిరవై మంది నాతో రెండున్నర గంటల పాటు బాతాఖానీ వేశారు. అంతమంది రావడానికి కారణం ఏమిటాని విశ్లేషించి చూస్తే తేలిందేమిటంటే - నాకున్న గుర్తింపు సాహితీకారుడిగా కాదు. వారిలో నేను రాసిన కథలు చదివినవారు ఎక్కువమంది లేరు. రాజకీయ, సామాజిక విశ్లేషకుడిగా నాకున్న యిమేజి, గ్రేట్‌ ఆంధ్రా వంటి పాప్యులర్‌ వెబ్‌సైట్‌ ద్వారా నా పేరు అందరికీ తెలియడం చేతనే అంతమంది వచ్చారు. పైగా మీటింగు జరిగిన తీరు కూడా విలక్షణంగా వుంది. పది నిమిషాలలో నా పరిచయం ముగిసిన తర్వాత అప్పణ్నుంచి రెండున్నర గంటల పాటు నేను కబుర్లు చెపుతూ, ప్రశ్నలకు సమాధానాలు చెపుతూనే వున్నాను. ఉపన్యాసమైతే భోజనానంతరం ఆవలించకుండా వినడం మహా కష్టం. నావి యింటరాక్టివ్‌గా వుండే కబుర్లు కావడంతో, వచ్చినవాళ్లంతా అలర్ట్‌గా, ఉత్సాహంగా వున్నారు. నేనూ యిలాటి ప్రయోగం గతంలో చేయలేదు. కష్టపడి, సమయం వెచ్చించి వచ్చినవాళ్లను నిరాశపరచనందుకు నేను ఆనందించాను."


No comments: