Saturday, 16 August 2025

Sathvadhanam-Bristol- 17-08-25




  • గాంధారిగాంధార రాజ్యం . ద్రౌపది ద్రుపద --కేకేయ కైకేయి,  కౌసల్య --ఏ రాజ్యం?
  • బాదరాయణ సంబంధం
  • లవ కుశ సినిమాలోని ‘రామ కథను వినరయ్యా’ పాటలో ‘అయోధ్యా నగరానికి రాజు దశరథ మహారాజు’ అని ఉంటుంది.
  • markata kishora nyayam
  • marjala kishira nyayam

   వంగతోటనుండు వరిమళ్ళలోనుండు

   జొన్నచేలనుండు చోద్యముగను
   తలుపుమూలనుండు తలమీఁదనుండును
   దీని భావమేమి తిరుమలేశ?
  •  అమూర్త సాధన అభియాంత్రికుడు?(Software Engineer)
  • కిలికించితము:రోషాశ్రుహర్షభీత్యాదుల సంకరరూపమగు స్త్రీ యొక్క శృంగారచేష్టా విశేషము
  • ప్రబంధం అంటే పురాణేతిహాసాలలో నుండి చిన్న కథను తీసుకొని, అష్టాదశవర్ణనలతో పెంచి పోషించి, స్వతంత్ర కావ్యంగా రచిస్తే అది ప్రబంధం కదా!
  •  దెయ్యం  VS  కొరివి దెయ్యం 
  • భూతం vs పిశాచం 
  • ఆత్మ  vs  ప్రేతా త్మ 
  • అద్వైతం నుండి  ద్వైతం వచ్చిందా?
  • సన్నెకల్లు దాస్తే పెళ్లి ఆగుతుందా?
  • అవలక్షణం, అవమానం, అవధానం 
  • దుర్మార్గం , దుర్ముహర్తము, దుశ్శాలువా 
  • గీత కార్మికులు
  • అక్కుపక్షి అనే పదానికి మూలం ఏమిటి
  • సుఖ దుఃఖాలు సినిమాలో ఒక పాటలో ‘వెన్నెల మాసమనీ’ అని ఉంది


Sanmana patram - Sri Padmakar garu Bristol Satahvadhanam

 ప్రణవపీఠాధీశులు, బ్రహ్మశ్రీ  వద్దిపర్తి పద్మాకర్  గారికి 

గౌరవాభిమానాలతో  సమర్పించుకుంటున్న 

ప్రశంసా పత్రం


కవితా సౌరభము వెలయించు కల్పతరువై

వాగ్విలాసమున సమస్తజన  సమ్మోహనకారుడువై 

జ్ఞాన గంగతో, బుధజన హృదయ దాహార్తి తీర్చెన్. 

అవధాని కళామణి,  మీరు సారస్వత దీపమై

విద్యా వినయమును విరాజిల్లెన్ మమ్ము ప్రకాశింపఁన్ !

మధుర సమ్మిళిత భాషణ, శ్రోతల ఆనందమై,

సాహిత్య సముద్రమున విహార యాత్రగావించెను

మీ  ప్రతిభా పాటవము సర్వదా స్ఫూర్తి దాయకమై

అవధాన సాహితీ సౌరభము చిరస్థాయిగా,

శశికిరణముల సంగమున విలసిల్లు మహా అంబుజమై!