-------------------------------------------దుర్యోధనుడు మయసభ ఏకపాత్రాభినయం -------------------------------
(చుట్టూ చూసి - ఆశ్చర్యానందములతో)
ఆహా ఏమి ఈ నందన వనం! సుందర నగరం! ఒక వైపు ఆకాశహర్మ్యాలు మరో వైపు సాంప్రదాయ గృహ సమూహాలు! ఒకవైపు యంత్ర రధములు, మరో వైపు అశ్వరోహులు.
(ప్రేక్షకులని చూసి )
తెల్ల వారు, నల్ల వారు అందరిని మించి మన భారత సోదరసోదరిమణులతో, రంగురంగులతో ఈ దేశం అలరారుతున్నదే!
(బిగ్ బెన్ ని చూసి )
ఏమి ఏమేమి, గోడ గడియారం భవనం పైన ఉన్నది? (చుట్టూరా తిరిగి ) నాలుగు వైపులా నలుగు కాల మానము లా? అయ్యారే! మన రాజ మందిరం పైన కూడా ఇలాంటిడి ఒకటి ఉండ వలె!
(లండన్ బ్రిడ్జి చూసి )
ఇది వంతెనాయా? వారధియా ? తెరుచుకోనుచున్నది , మూసుకోనుచున్నది! నా చిత్తభ్రమ కాదు కదా !
(గట్టిగా నవ్వి ) మన గంగా నది పైన కూడా ఈ మాదిరి వంతెన నిర్మించ వలె!
(London eye ని చూసి) దుర్యొధనుదు: ఏమి ఏమిమి! కృష్ణ బావ సుదర్శ చక్రం విశ్వ, రూపం చూపించున్నది! ఇది దుశ్శకునం కాదు కదా! (తేరపారి చూసి). ఈ చక్రమునకు చిన్న చిన్న గదులు వాని లో మనుషులూనా! వాహ్వా! ఎవరు రూపిందించిరో, మయుని మరిపించిరి, మమ్ము మురపించిరి!
(వాక్స్ museum)
నాలుగు అడుగులు వేసి....గాంధి మహత్ముడు, సచిన్ టెందుల్కర్ సంభాషిస్తునారేమి!
మనము కూడా ముచ్చటించదము
(వారి దగ్గరికి వెళ్లి ) ఏమి ఏమేమి, ఏవి కేవలం మైనపు శిల్పములా! ఆ నాటి మయసభలో సాలభంజికలను మించి కన్నులను మాయ చేయుచున్నవి. ఎవరీ అపరబ్రహ్మ?
ఈ సుయోధుని విగ్రహం కూడా ఉండిన ఈ సాలభంజిక సభకు నిండుదనం వచ్చును.(వికటాట్టహాసం )
(ట్యూబ్ ని చూసి )
ఏమి ఈ శకటం! అశ్వం లేదు! చోదుడూ లేదు. (రెండు అడుగులు వెనక్కి వేసి ) దశ శకటంలు ఒక దానికి మరొకటి జోడించితిరి. ఒరోరి ఇది ఏమి! సొరంగ మార్గము లోకి తుర్రుమంటున్నది!
దీనిని సొరంగవిద్యత్యంత్రదశశకటం అనవలనెమో!
మయ సభని మిoచి - సంబ్రమాశ్చర్యములో ముంచి,
ఆనందడోలికలలూగించి - కల నిజములిని ఏకము చేయుచున్నది
ఈ లండన్ నగరము , ఇచ్చట ఉండుటయే ఒక గౌరము !!!
------------------------------------------------------------------------------------------------------------------(చుట్టూ చూసి - ఆశ్చర్యానందములతో)