Thursday, 15 September 2016
Sunday, 7 August 2016
పాలకొల్లు స్నేహం (తేటగీతి)
వీధి బడిలోన విరిసిన విరులు, బజ్జి
పప్పు ల అర విందులు, పేక పదరచనలు
దేవుడుకు కాదు కనపడే దేవకన్నె
కే ప్రదక్షిణ, రోడ్లుపై కెవ్వు కేక!
మరవగలమా మధురమైన మన సుచెలిమి!
పప్పు ల అర విందులు, పేక పదరచనలు
దేవుడుకు కాదు కనపడే దేవకన్నె
కే ప్రదక్షిణ, రోడ్లుపై కెవ్వు కేక!
మరవగలమా మధురమైన మన సుచెలిమి!
Wednesday, 3 August 2016
తెలుగు భాష -1 (ఆటవెలది)
ఉర్దు తమిళ సిక్కు గుజరాతి ఉత్తర
వారు వారి భాష పలికె మురిసె
ఏడ ఉండు మనకు ఏలరా బీరము
తెలుగు తేజ శ్వేత దేశ పౌర
వారు వారి భాష పలికె మురిసె
ఏడ ఉండు మనకు ఏలరా బీరము
తెలుగు తేజ శ్వేత దేశ పౌర
Thursday, 28 July 2016
నా మొదటి పద్యం
----------------------------------------
వేష భాష మారె ఇలికను పాలిం చె
ఆస్తిపాస్తి పెరిగె అందనంత
అందడంట తల్లితండ్రికి ధర్మమా
తెలుగు తేజ శ్వేత దేశ పౌర
----------------------------------------
ఆటవెలది
వేష భాష మారె ఇలికను పాలిం చె
ఆస్తిపాస్తి పెరిగె అందనంత
అందడంట తల్లితండ్రికి ధర్మమా
తెలుగు తేజ శ్వేత దేశ పౌర
----------------------------------------
ఆటవెలది
Monday, 21 March 2016
London Mayasabha
-------------------------------------------దుర్యోధనుడు మయసభ ఏకపాత్రాభినయం -------------------------------
(చుట్టూ చూసి - ఆశ్చర్యానందములతో)
ఆహా ఏమి ఈ నందన వనం! సుందర నగరం! ఒక వైపు ఆకాశహర్మ్యాలు మరో వైపు సాంప్రదాయ గృహ సమూహాలు! ఒకవైపు యంత్ర రధములు, మరో వైపు అశ్వరోహులు.
(ప్రేక్షకులని చూసి )
తెల్ల వారు, నల్ల వారు అందరిని మించి మన భారత సోదరసోదరిమణులతో, రంగురంగులతో ఈ దేశం అలరారుతున్నదే!
(బిగ్ బెన్ ని చూసి )
ఏమి ఏమేమి, గోడ గడియారం భవనం పైన ఉన్నది? (చుట్టూరా తిరిగి ) నాలుగు వైపులా నలుగు కాల మానము లా? అయ్యారే! మన రాజ మందిరం పైన కూడా ఇలాంటిడి ఒకటి ఉండ వలె!
(లండన్ బ్రిడ్జి చూసి )
ఇది వంతెనాయా? వారధియా ? తెరుచుకోనుచున్నది , మూసుకోనుచున్నది! నా చిత్తభ్రమ కాదు కదా !
(గట్టిగా నవ్వి ) మన గంగా నది పైన కూడా ఈ మాదిరి వంతెన నిర్మించ వలె!
(London eye ని చూసి) దుర్యొధనుదు: ఏమి ఏమిమి! కృష్ణ బావ సుదర్శ చక్రం విశ్వ, రూపం చూపించున్నది! ఇది దుశ్శకునం కాదు కదా! (తేరపారి చూసి). ఈ చక్రమునకు చిన్న చిన్న గదులు వాని లో మనుషులూనా! వాహ్వా! ఎవరు రూపిందించిరో, మయుని మరిపించిరి, మమ్ము మురపించిరి!
(వాక్స్ museum)
నాలుగు అడుగులు వేసి....గాంధి మహత్ముడు, సచిన్ టెందుల్కర్ సంభాషిస్తునారేమి!
మనము కూడా ముచ్చటించదము
(వారి దగ్గరికి వెళ్లి ) ఏమి ఏమేమి, ఏవి కేవలం మైనపు శిల్పములా! ఆ నాటి మయసభలో సాలభంజికలను మించి కన్నులను మాయ చేయుచున్నవి. ఎవరీ అపరబ్రహ్మ?
ఈ సుయోధుని విగ్రహం కూడా ఉండిన ఈ సాలభంజిక సభకు నిండుదనం వచ్చును.(వికటాట్టహాసం )
(ట్యూబ్ ని చూసి )
ఏమి ఈ శకటం! అశ్వం లేదు! చోదుడూ లేదు. (రెండు అడుగులు వెనక్కి వేసి ) దశ శకటంలు ఒక దానికి మరొకటి జోడించితిరి. ఒరోరి ఇది ఏమి! సొరంగ మార్గము లోకి తుర్రుమంటున్నది!
దీనిని సొరంగవిద్యత్యంత్రదశశకటం అనవలనెమో!
మయ సభని మిoచి - సంబ్రమాశ్చర్యములో ముంచి,
ఆనందడోలికలలూగించి - కల నిజములిని ఏకము చేయుచున్నది
ఈ లండన్ నగరము , ఇచ్చట ఉండుటయే ఒక గౌరము !!!
------------------------------------------------------------------------------------------------------------------(చుట్టూ చూసి - ఆశ్చర్యానందములతో)

MBS ప్రసాద్ గారి తో కబుర్లు
శ్రీ MBS ప్రసాద్ గారి తో కబుర్లు
శ్రీ MBS ప్రసాద్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఆంగ్లాoధ్ర లలో కధా రచయత, వ్యాస రచయత, అనువాదకుడు, సంపాదకుడు,రేడియో జాకీ , టీవీ యాంకర్, శీర్షికా నిర్వాహకుడు. కీర్తి పురస్కారం, నంది అవార్డు , అనేక సార్లు కధలకి బహుమతులు పొందారు. ఈ రకముగా వీరి సాహతీవ్యవసాయం బహుముఖాలుగా సాగుతున్నది .
UK లో ఉన్న తెలుగు వారికి సాహితీ సౌరభాలు అందిచాలానే ఉద్దేశ్యంతో తాల్, సిపి బ్రౌన్ ఫౌండేషన్ సంయుక్తంగా MBS ప్రసాద్ గారి తో డిసెంబర్ 12న (2015) Hounslow లో ఈ కబుర్లు కార్యక్రమం నిర్వహించడం జరిగినది. రాజేష్ తోలేటి గారి శ్రీ MBS పరిచయంతో మొదలయిన సభ జనరంజకమ గా సాగినది. ముఖా ముఖిగా రాజకీయ, సామాజిక, సాహిత్య సంభాషణలతో ఆద్యంతం ఉత్సాహంగా నడిచింది. సుదూర తీరలనుండి శ్రోతలు వచ్చి వివిధ కోణాలలో ప్రసాద్ గారికి ప్రశ్నలు సంధించారు. ఆయన నేర్పుగా, ఓర్పుగా సమాధానులు చెప్పి రక్తి కట్టించారు .
చివరిగా తాల్ వ్యవస్థాపకులు శ్రీ రాములు, శ్రీ రామనయాడు, ఛైర్మన్ శ్రీ సత్యేంద్ర మరియు తాల్ ట్రస్టీలు MBS గారిని సన్మానించారు.
ఈ కార్యక్రమం గురించి ఆయన మాటల్లోనే
"కితం ఏడాది అనుకోకుండా యుకె వెళ్లడం, లండన్‌లో తాల్, సిపి బ్రౌన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావడం జరిగాయి. వ్యక్తిగత పనులపై వచ్చి కుటుంబసభ్యులతో వున్నాను కాబట్టి పైన చెప్పిన మొహమాటాలేవీ లేవు. ఉదయం నేనుండే కొవెంట్రీ నుంచి గంట రైలు ప్రయాణంతో లండన్ చేరడం, మీటింగుకి హాజరు కావడం జరిగాయి. నిర్వాహకులు ఆ రాత్రి బస ఏర్పాటు చేయడమే కాక, ఆ రోజు రెండు ముఖ్యప్రదేశాలు, మర్నాడు నాలుగు దర్శనీయ స్థలాలు చూపించారు. నేను ఫుల్ ఖుష్. సభకు ఆశించినదాని కంటె రెట్టింపు జనం రావడంతో వాళ్లు ఖుష్. మీటింగు తర్వాత కూడా ఓ యిరవై మంది నాతో రెండున్నర గంటల పాటు బాతాఖానీ వేశారు. అంతమంది రావడానికి కారణం ఏమిటాని విశ్లేషించి చూస్తే తేలిందేమిటంటే - నాకున్న గుర్తింపు సాహితీకారుడిగా కాదు. వారిలో నేను రాసిన కథలు చదివినవారు ఎక్కువమంది లేరు. రాజకీయ, సామాజిక విశ్లేషకుడిగా నాకున్న యిమేజి, గ్రేట్ ఆంధ్రా వంటి పాప్యులర్ వెబ్‌సైట్ ద్వారా నా పేరు అందరికీ తెలియడం చేతనే అంతమంది వచ్చారు. పైగా మీటింగు జరిగిన తీరు కూడా విలక్షణంగా వుంది. పది నిమిషాలలో నా పరిచయం ముగిసిన తర్వాత అప్పణ్నుంచి రెండున్నర గంటల పాటు నేను కబుర్లు చెపుతూ, ప్రశ్నలకు సమాధానాలు చెపుతూనే వున్నాను. ఉపన్యాసమైతే భోజనానంతరం ఆవలించకుండా వినడం మహా కష్టం. నావి యింటరాక్టివ్‌గా వుండే కబుర్లు కావడంతో, వచ్చినవాళ్లంతా అలర్ట్‌గా, ఉత్సాహంగా వున్నారు. నేనూ యిలాటి ప్రయోగం గతంలో చేయలేదు. కష్టపడి, సమయం వెచ్చించి వచ్చినవాళ్లను నిరాశపరచనందుకు నేను ఆనందించాను."
మరో ప్రస్థానం
(శ్రీ శ్రీ అభిమానులకి క్షమాపణల తో )
సైబర్ ప్రపంచం,
సైబర్ ప్రపంచం,
సైబర్ ప్రపంచం పిలిచింది!
స్మార్ట్ ఫోన్ లో వాట్సప్ప్ తో,
ఐపాడ్ లో ఫేసు బుక్కు తో !
పోదాం, పోదాం లో లో కి!
లాప్ టాప్ నో,
డెస్క్ టాప్ నో,
వైఫ్యె కి కనక్ట్ చేసుకొని
లాగ్ ఇన్ అయిపోదాం!
తెలియట లేదా
సైబర్ ప్రపంచం రహదారి?
ఎంత సేపైనా, కంటి నొప్పైనా
లెక్క చెయ్యకుండా తెగ తిరేగేద్దం !
చాట్ లు చేస్తూ,
సైట్లు చూస్తూ,
దారి పొడుగునా
దూరం వాళ్ళకి దగ్గర అవుతూ,
దగ్గర వాళ్ళకి దూరం అవుతూ!
వైరస్లూ, వార్మలు,
స్పై వేరులు ,స్పామ్లు మెయిల్ లా మనకడ్డం?పదండి సైట్కు,
పదండి చాట్కు!

TCC
TAL ఆధ్వర్యములొ మన తెలుగు పిల్లలకి తెలుగు భాష, సంస్కృతి , సంప్రదాయాలను మరియు భారతీయ కళలను అందిచాలనే ధ్యేయంతో రెండు
సాంస్కృతిక కేంద్రాలు పని చేస్తున్నాయి.
1. Telugu Cultural Center (TCC) West
2. Telugu Cultural Center (TCC) East
గత 6 సంవత్సరాలుగా నిరాటంకగా ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణం తల్లి తండ్రుల ఆసక్తి, నిర్వాహకుల సామర్ధ్యం. ఇక్కడ సంగీతం , భరత్ నాట్యం నేర్చుకుంటున్న చిన్నారులు అనేక ప్రదర్శనలు ఇస్తూ ఉన్నరు. కేవలం తాల్ కి సంభందించిన వేడుకులలోనే కాకుండా ఇతర సంస్థలనుండి వచ్చిన ఆహ్వానాలని అందుకొని, వారి సమావేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు. ఇది ఆయా గురువుల సామర్ధ్యానికి , శిష్యుల చిత్తశుద్ధికి నిదర్శనము.
ముఖ్యంగా 'చిల్డ్రన్స్ డే ' నాడు తాల్ సమావేశాలలో TCC పిల్లలదే 'హవా ' అంటే అతిశయోక్తి కాదు.
పిల్లలని చూసి వారి తల్లి తండ్రులు కూడా ఈ కళల్ని అభ్యసించడం అనుకోని పరిణామం!
వారు కూడా ఈ కళల్ని ప్రదర్శించడం ముదావహము!!
ప్రస్తుతం తెలుగు, కర్ణాటక సంగీతం, భరతనాట్యం తరగతులు నిర్వహించడం జరుగుచున్నది.
ఆసక్తి ఉన్నవారికి కూచిపూడి , బాలీవుడ్ , తబలా వంటి తరగతులు ఏర్పాటు చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్రమశిక్షణ తో మీ పిల్లలకి మన తెలుగు భాష ని, కళల్ని అందిస్తున్న మమ్మలిని ప్రోత్సహించండి!
మరిన్ని వివరాల కోసం వెంటనే తాల్ ని సంప్రదించండి!
ఉపాధ్యాయులు:
కర్ణాటక సంగీతం: శ్రీ వీణాపాణి
తెలుగు: శ్రీ రాజేష్ తోలేటి
భరతనాట్యం:శ్రీ అనమిహ
తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది!!!

Subscribe to:
Posts (Atom)