Sunday, 12 March 2017

PawanKalayan/Tilak parody


పవన్ కళ్యాణ్ గారు ఒక ఉపన్యాసం లో చెప్పినవి దేవరకొండ బాల గంగాధర్ తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి సంకలనం లో "నీడలు" అనే కవిత లో ఆఖరి పంక్తులు, కొద్దిగా మార్చి!


ఇల్లేమో దూరం,
అసలే చీకటి,
గాఢాంధకారం
దారంతా గతుకులు,
చేతిలో దీపం లేదు
కాని గుండెల నిండా ధైర్యం ఉంది ..... ధైర్యం ఉంది ......
--------------------------------------------

నేను ఆ మధ్య ఇండియా  వెళదాం  అనుకున్నప్పుడు ఇలా అనిపించింది ......


దేశమేమో దూరం,
సెలవే కటాకటి,
బాసు  కనికరం.
జేబంతా   చినుగులు ,
చేతిలో టికెట్ లేదు
కాని  తొయ్యలేనంత  లగేజ్  ఉంది.....  లగేజ్  ఉంది.......











Saturday, 25 February 2017

అమ్మ (ఉత్కళిక )
  సాధారణంగా పద్యాలు, శ్లోకాలు పండితులకి    మాత్రమేనని,  ఆధునిక కవిత్వం పామరులకు అని ఒక నమ్మకం.  ఒక ఛందోబద్ద పద్యాన్ని నేటి పాఠకులకి  అర్ధమయ్యే రీతిలో (ఆధునిక కవితలా  ) అందించాలని  చేసిన ప్రయత్నం! 

కడుపు తీపిని కట్టుకొని
ఇడుము చేతిని పట్టుకొని
కర కర మంటలని దాచి
చుర చుర ఎండలుని కాచి
దిక్కులు తెన్నులు తెలియక
రుక్కులు రొచ్చులు ఒరగక
ఓడ మాక  సాగి పోమ్మ
గూడు సేర గుబులు  పోమ్మ


Thursday, 15 September 2016

కంది శంకరయ్య గారి సమస్య పురణకి నా మొదటి ప్రయత్నం

http://kandishankaraiah.blogspot.co.uk/2016/08/2119.html


------------------------------------పాకులాట లాడె పాడు పిజ్జా, బర్గరుల్ కొరకు,తెనుఁగు సురుచులు మరిచె!హాటు డాగు,చిప్పు,హాంబర్గరులకు ప్రాధాన్యమేల మనకు ధాన్యముండ.


-----కంది శంకరయ్య గారి సవరణ----

పాకులాడుచుంద్రు పాడు పిజ్జా బర్గరులఁ దినంగ తెనుఁగు రుచుల మరచి;హాటు డాగు చిప్సు హాంబర్గరులకు ప్రాధాన్యమేల మనకు ధాన్యముండ.


Sunday, 7 August 2016

పాలకొల్లు స్నేహం (తేటగీతి)

 వీధి బడిలోన  విరిసిన  విరులు,  బజ్జి 
పప్పు ల అర విందులు, పేక పదరచనలు 
దేవుడుకు కాదు కనపడే దేవకన్నె
కే  ప్రదక్షిణ, రోడ్లుపై   కెవ్వు కేక!
మరవగలమా మధురమైన మన సుచెలిమి!

Wednesday, 3 August 2016

తెలుగు భాష -1 (ఆటవెలది)

ఉర్దు తమిళ సిక్కు  గుజరాతి  ఉత్తర
వారు వారి భాష పలికె మురిసె
ఏడ ఉండు మనకు ఏలరా  బీరము
తెలుగు తేజ శ్వేత దేశ  పౌర



Thursday, 28 July 2016

నా మొదటి పద్యం

----------------------------------------
వేష భాష మారె ఇలికను పాలిం చె 
ఆస్తిపాస్తి పెరిగె అందనంత 
అందడంట తల్లితండ్రికి ధర్మమా
తెలుగు తేజ శ్వేత దేశ  పౌర
----------------------------------------

ఆటవెలది 

Monday, 21 March 2016

London Mayasabha

-------------------------------------------దుర్యోధనుడు  మయసభ ఏకపాత్రాభినయం  -------------------------------


(చుట్టూ చూసి  - ఆశ్చర్యానందములతో)
ఆహా ఏమి ఈ నందన వనం! సుందర నగరం! ఒక వైపు ఆకాశహర్మ్యాలు మరో వైపు  సాంప్రదాయ గృహ సమూహాలు! ఒకవైపు యంత్ర రధములు, మరో వైపు అశ్వరోహులు.
(ప్రేక్షకులని  చూసి )
తెల్ల వారు, నల్ల వారు  అందరిని మించి  మన భారత సోదరసోదరిమణులతో,  రంగురంగులతో  ఈ దేశం అలరారుతున్నదే!
(బిగ్ బెన్ ని చూసి )
ఏమి  ఏమేమి,  గోడ గడియారం  భవనం పైన ఉన్నది? (చుట్టూరా తిరిగి ) నాలుగు వైపులా  నలుగు కాల మానము లా? అయ్యారే! మన రాజ మందిరం పైన కూడా ఇలాంటిడి ఒకటి ఉండ వలె!
(లండన్ బ్రిడ్జి  చూసి )
ఇది వంతెనాయా? వారధియా ? తెరుచుకోనుచున్నది , మూసుకోనుచున్నది! నా చిత్తభ్రమ కాదు కదా !
(గట్టిగా నవ్వి ) మన గంగా నది పైన కూడా  ఈ  మాదిరి వంతెన  నిర్మించ వలె!

(London eye ని చూసి) దుర్యొధనుదు: ఏమి ఏమిమి! కృష్ణ  బావ సుదర్శ చక్రం విశ్వ, రూపం చూపించున్నది! ఇది దుశ్శకునం కాదు కదా! (తేరపారి  చూసి).  ఈ  చక్రమునకు చిన్న చిన్న గదులు వాని లో మనుషులూనా! వాహ్వా! ఎవరు రూపిందించిరో, మయుని మరిపించిరి, మమ్ము మురపించిరి!
(వాక్స్ museum)

నాలుగు అడుగులు వేసి....గాంధి మహత్ముడు, సచిన్ టెందుల్కర్ సంభాషిస్తునారేమి!
మనము కూడా ముచ్చటించదము 
(వారి దగ్గరికి వెళ్లి ) ఏమి ఏమేమి, ఏవి కేవలం మైనపు శిల్పములా! ఆ నాటి మయసభలో   సాలభంజికలను  మించి కన్నులను మాయ చేయుచున్నవి. ఎవరీ అపరబ్రహ్మ? 
ఈ సుయోధుని  విగ్రహం కూడా ఉండిన ఈ సాలభంజిక సభకు నిండుదనం వచ్చును.(వికటాట్టహాసం )
(ట్యూబ్ ని చూసి )
ఏమి  ఈ శకటం! అశ్వం లేదు! చోదుడూ లేదు. (రెండు అడుగులు వెనక్కి వేసి ) దశ  శకటంలు ఒక దానికి మరొకటి జోడించితిరి. ఒరోరి ఇది  ఏమి! సొరంగ మార్గము లోకి  తుర్రుమంటున్నది!
దీనిని సొరంగవిద్యత్యంత్రదశశకటం అనవలనెమో!

మయ సభని మిoచి - సంబ్రమాశ్చర్యములో ముంచి,
ఆనందడోలికలలూగించి - కల నిజములిని ఏకము  చేయుచున్నది
ఈ లండన్ నగరము , ఇచ్చట ఉండుటయే  ఒక గౌరము !!!

------------------------------------------------------------------------------------------------------------------