Saturday, 16 October 2021

Telugu Shatakam

1. తెలుగు తెనుఁగు ఆంధ్ర తెఱుగులేమైనను 

పలుక తేనె లొలికు;  పాట పాడ  

ధవళ మేఘమాల  ధరణిని  చుంబించె  

తెలుగు తేజ! యన్యదేశపౌర 


2.ఉర్దు తమిళ సిక్కు  గుజరాత  యుత్తర

వారు వారి భాష పలికె మురిసె

నేడనున్న నేడు నీకేల  బీరము

తెలుగు తేజ! యన్యదేశపౌర 


3.వేష భాష మారె ఇలికను పాలించె 

ఆస్తిపాస్తి పెరిగె అందనంత 

నందడంట తల్లిదండ్రికి ధర్మమా

తెలుగు తేజ! యన్యదేశపౌర 


4. దేశ భాషలందు తెలుగు లెస్సని కొని 

యాడ  బడెను అవనియందు దేవ 

బాస కినుక జూపె  బాగైన తెనుగుపై 

తెలుగు తేజ! యన్యదేశపౌర