Monday, 1 April 2019

గుడ్ న్యూస్


యథావిధిగా శనివారం ఇంటికి ఫొన్ చేసా. అమ్మ అందుకుంటూనే "ఒరేయ్! నీకో గుడ్ న్యూస్" అంటూ ఒక గావు కేక పెట్టింది. ఒక్కసారి ఉలిక్కి పడ్డా నాకు  పెళ్ళి చూపులు ఏర్పాటు చేసారెమూ అని. వెంటనే నా సాఫ్ట్ వేర్  సహేళి (అదే కొలీగు) "భార్గవి " గుండెల్లో తన్నినట్లు అనిపించింది.



అమ్మ :"నీ మరదలు లలిత పెళ్లి కుదిరిందిరా, May 16 ".

హమ్మాయ అనుకుని " నాకు గుడ్ న్యూస్ ఎంటే, దానికి పెళ్లి కుదిరితే !"

అమ్మ: "అదేలేరా, అందరికి మంచిదే కదా"



అసలు ఈ "నీకో Good news"  అనే పద ప్రయోగమే నాకు నచ్చదు. దానికో కాగడాలాంటి  కారణం ఉంది. ఒక అరడజన్ రింగులు వేసుకుంటే ...... 



ఆ రోజుల్లోనా MCA  స్నేహితురాలు సంధ్య హైదరాబాద్ లొనే ఉండేది. మా ఆఫీస్ కి దగ్గరే వాళ్ల ఇల్లు. రెండేళ్ల క్రితమే పెళ్లి అయ్యింది. పెళ్లి అయ్యాక  సంధ్య ఉద్యోగం, సద్యోగం  ఏమి చెయ్యలేదు. అప్పుడప్పుడు వాళ్ళింటికి లంచ్ కూ/ డిన్నర్ కూ వెళ్లేవాడిని గాబట్టి సంధ్య వాళ్ల ఆయన కిరణ్ కూడా బాగానే పరిచయం.ఎమీ ఎప్పుడైనా  సంధ్య సాయంత్రం మా ఆఫీసు కి వస్తే 'కాఫీడే ' కో , బేకరి కో వెళ్ళే వాళ్ళం. కిరణ్ కి చెబితే అయిష్టం గానే ఒప్పుకోనేవాడు అని ఒక సారి చెప్పింది.

ఒక ఆదివారం సాయంత్రం ఫోన్ చేసింది,మంచి ఉత్సాహంగా "నీకో గుడ్ న్యూస్" అంది. నేను, నాకు గుడ్ న్యూస్ అయితే ముందు సంధ్య కి ఎలా తెలిసింది అబ్బా అని  తెగ ఆశ్చర్య పోతూ, త్వరగా చెప్పు అన్నా. కొద్దిగా సిగ్గుపడుతూ "I am going to have baby in 6 months time" అంది. నిజం చెప్పాలి అంటే అది విని కొద్దిగా బుర్ర తిరిగి, వాళ్ళ ఆయనికి చెప్పినట్టు చెప్పింది ఏమిటి రా అనుకున్నా. తర్వాత తెలిసింది ఏంటి అంటే, ఆ ఫోన్ చేసినప్పుడు ప్రక్కనే వున్న కిరణ్ కి కూడా అలాగే అనిపించి , వాళ్ళిద్దరి  మధ్య కొద్దిపాటి "DISCUSSION" కూడా జరిగింది అని. అప్పడి నుంచి ఎప్పుడు కిరణ్ ని కలిసినా నన్ను కొద్దిగా అనుమానంగా చూస్తున్నట్లు నాకు అనిపించేది.

అందువలన, ఎవడికి పడితే  వాడికి, ఏది పడితే 
అది "నీకో గుడ్ న్యూస్ " అని చెబితే  వాడికి, మీకు కూడా బాగా  బాడ్ న్యూస్ అయిపోవచ్చు. ఏమంటారు?