పవన్ కళ్యాణ్ గారు ఒక ఉపన్యాసం లో చెప్పినవి దేవరకొండ బాల గంగాధర్ తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి సంకలనం లో "నీడలు" అనే కవిత లో ఆఖరి పంక్తులు, కొద్దిగా మార్చి!
ఇల్లేమో దూరం,
అసలే చీకటి,
గాఢాంధకారం
దారంతా గతుకులు,
చేతిలో దీపం లేదు
కాని గుండెల నిండా ధైర్యం ఉంది ..... ధైర్యం ఉంది ......
--------------------------------------------
నేను ఆ మధ్య ఇండియా వెళదాం అనుకున్నప్పుడు ఇలా అనిపించింది ......
దేశమేమో దూరం,
సెలవే కటాకటి,
బాసు కనికరం.
జేబంతా చినుగులు ,
చేతిలో టికెట్ లేదు
కాని తొయ్యలేనంత లగేజ్ ఉంది..... లగేజ్ ఉంది.......