Sunday, 12 March 2017

PawanKalayan/Tilak parody


పవన్ కళ్యాణ్ గారు ఒక ఉపన్యాసం లో చెప్పినవి దేవరకొండ బాల గంగాధర్ తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి సంకలనం లో "నీడలు" అనే కవిత లో ఆఖరి పంక్తులు, కొద్దిగా మార్చి!


ఇల్లేమో దూరం,
అసలే చీకటి,
గాఢాంధకారం
దారంతా గతుకులు,
చేతిలో దీపం లేదు
కాని గుండెల నిండా ధైర్యం ఉంది ..... ధైర్యం ఉంది ......
--------------------------------------------

నేను ఆ మధ్య ఇండియా  వెళదాం  అనుకున్నప్పుడు ఇలా అనిపించింది ......


దేశమేమో దూరం,
సెలవే కటాకటి,
బాసు  కనికరం.
జేబంతా   చినుగులు ,
చేతిలో టికెట్ లేదు
కాని  తొయ్యలేనంత  లగేజ్  ఉంది.....  లగేజ్  ఉంది.......











Saturday, 25 February 2017

అమ్మ (ఉత్కళిక )
  సాధారణంగా పద్యాలు, శ్లోకాలు పండితులకి    మాత్రమేనని,  ఆధునిక కవిత్వం పామరులకు అని ఒక నమ్మకం.  ఒక ఛందోబద్ద పద్యాన్ని నేటి పాఠకులకి  అర్ధమయ్యే రీతిలో (ఆధునిక కవితలా  ) అందించాలని  చేసిన ప్రయత్నం! 

కడుపు తీపిని కట్టుకొని
ఇడుము చేతిని పట్టుకొని
కర కర మంటలని దాచి
చుర చుర ఎండలుని కాచి
దిక్కులు తెన్నులు తెలియక
రుక్కులు రొచ్చులు ఒరగక
ఓడ మాక  సాగి పోమ్మ
గూడు సేర గుబులు  పోమ్మ